breaking news
Korea Masters Grand Prix
-
ఫైనల్లో అష్మిత
సియోల్: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అష్మిత చాలిహా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 50వ ర్యాంకర్ అషి్మత 21–13, 16–21, 21–13తో భారత్‌కే చెందిన రక్షిత శ్రీపై విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సింగిల్స్ ఫైనల్ చేరడం అష్మితకు ఇదే తొలిసారి. క్వార్టర్స్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, టాప్ సీడ్ హినా అకెచి (జపాన్)ను ఓడించిన అష్మిత... నేడు జరగనున్న ఫైనల్లో నాలుగో సీడ్ హాన్ క్సియాన్ జీ (చైనా)తో తలపడనుంది. గత వారం భారత యువ షట్లర్ తన్వీ శర్మ తైపీ ఓపెన్ టైటిల్ సాధించగా... ఇప్పుడు అష్మిత కొరియా ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. -
అష్మిత సంచలనం
సియోల్: కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత రైజింగ్ స్టార్స్ అష్మిత చాలిహా, రక్షిత శ్రీలలో ఒకరు ఫైనల్ చేరుకుంటారు. టైటిల్ పోరు కోసం వీరిద్దరు సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. ప్రపంచ 22వ ర్యాంకర్, టాప్ సీడ్ హినా అకెచి (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 50వ ర్యాంకర్ అష్మిత 20–22, 21–15, 21–19తో నెగ్గింది. మరో క్వార్టర్ ఫైనల్లో రక్షిత శ్రీ 18–21, 21–19, 21–18 తో తన్వీ శర్మను ఓడించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణ ప్రసాద్–పృథ్వీ రాయ్ (భారత్) 7–21, 8–21 తో మాన్ వె చోంగ్–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో ఓడారు. -
కశ్యప్ ఖాతాలో కాంస్యం
జెజు (కొరియా): ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్యాన్ని సాధించాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో కశ్యప్ 21–23, 16–21తో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో ఓడిన కశ్యప్‌కు 1,740 డాలర్ల (రూ. లక్షా 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


