అంబానీ కుటుంబం సోమవారం గణేశ్ చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా రుపుకుంది. నిజానికి అంబానీ ఇంట గణేశ్ నవరాత్రుల్లో అత్యంత ప్రత్యేకం. అక్కడ విఘ్న వినాయకుడు 'యాంటిలియా చా రాజా'గా పూజలందుకుంటాడు. ఇక ఈ వేడుకల్లో భాగంగా శంకర్ మహదేవన్ పాడిన ప్రసిద్ధ భక్తిగీతం ‘శ్రీ గణేశాయ ధీమహి’ పాటకు అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ సతీమణి రాధికా మర్చంట్ అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది.
ఆమె సుందరమైన ప్రదర్శన, గణేశుని దివ్య రూపాలు, జ్ఞానం, విశ్వవ్యాప్త ఉనికిని కీర్తించే ఈ సంస్కృత భక్తిగీతానికి లయబద్ధంగా చేసిన రాధికా నృత్యం అక్కడున్న వారందరీ దృష్టిని అమితంగా ఆకర్షించింది. కాగా, 2005లో వచ్చిన ‘విరుద్ధ్’ చిత్రంలోనిది ఈ గీతం. దీనికి అజయ్-అతుల్ సంగీత ద్వయం సంగీతం అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. అందరీ మనసులను హత్తుకునే ఈ పాట అర్థం ఏంటో సవివరంగా చూద్దామా..!.
‘శ్రీ గణేశాయ ధీమహి’ అంటే..
‘శ్రీ గణేశాయ ధీమహి’ అనే పదబంధానికి అర్థం గణేశుడిని ధ్యానిద్దాం లేదా గణేశుడి దివ్య రూపాన్ని మననం చేసుకుందాం అని అర్థమట. ఈ పాట వినాయకుడి విభిన్న గుణాలను, రూపాలను వర్ణించే సంస్కృత ప్రార్థన. ఇందులో ఏకదంత, వక్రతుండ, గజానన అంటూ వినాయకుడిని కీర్తిస్తూ సాగే అద్భుతమైన గీతం.
ఈ పాటతో ఆయన్ను జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని, ఆశీర్వాదాలను అందించమంటూ ప్రార్థిస్తారు భక్తులు. ఈ గీతం కేవలం అడ్డంకులు తొలగించే వాడికంటే గొప్పవాడిగా వర్ణిస్తూ వినాయకుడి గుణాలను చాటే భక్తిపాట.
ఇదీ చదవండి: అత్యంత విలక్షణమైన గణేశ్ ఆలయం..! ఆ రూపంలోనే పూజలందుకుంటాడు..)


