నటుడు ఆదిసాయికుమార్..ఈ తరం జెన్ ఆల్ఫా, వాళ్ల పెంపకం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోని కుమారుడికి జన్మనివ్వడంతో తండ్రిగా మరో కొత్త అద్యాయనం మొదలైందంటూ పేరెంట్‌గా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె అయానా పెంపక గురించి చెబుతూ..ఈ జెనరేషన్‌ని పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుకొచ్చాడు ఆది. నేటి పిల్లలకు రక్షణ, స్వేచ్ఛ, మార్గదర్శకత్వం, సమతుల్యం అవసరమని నొక్కి చెబుతున్నాడు.
ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో ఎలా మెలగాలో ప్రతి పేరెంట్ తెలుసుకోవాలని చెబుతున్నారు. తాను రక్షణను కల్పిస్తూనే కూల్‌గా వ్యవహరించే తండ్రిని అని చెప్పారు. తన కూతురు అయానాను పెంచుతున్నప్పుడు నేర్చుకున్న పాఠాలే, పెంపకం పట్ల తన దృక్పథాన్ని నిరంతరం తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. ఈ తరం పిల్లల జీవితాల్లో సాంకేతికత ఎంతగా పెనవేసుకుపోయిందో చూస్తూనే ఉన్నాం, అందువల్ల స్క్రీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు ఆది.
అందుకే తన భార్య అరుణ తాను ఆ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటామని చెప్పాడు. డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్‌లు ప్రతిచోట ఉన్నాయని, పాఠశాల ప్రకటనలు సైతం వాట్సాప్ ద్వారానే వస్తున్నాయని అన్నారు. ఇక యూట్యూబ్‌లో మంచి,చెడు రెండు పక్కపక్కనే ఉంటాయని అన్నారు. తాను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడే డిజిటల్ ప్రపంచం పిల్లల దైనందిన జీవితంలో ఎంత లోతుగా భాగమైపోయిందో చూసి ఆశ్చర్యపోయానని అంటున్నారు.
ఎందుకంటే యూఎస్ పర్యటనలో తన కూతురు ఆన్‌లైన్ వీడియోలో చూసిన ప్రదేశాలను నేరుగా చూడగానే గుర్తుపట్టేసి చెబుతుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఆమె అపారమైన జ్ఞాపకశక్తికి ఫిదా అయినా..డిజిటల్ ఫుట్‌ప్రింట్ గురించి ఒక పేరేంట్‌గా తాను అవగాహన కల్పించాల్సి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేసిందని అంటున్నారు.
(చదవండి: కంజీవరం చీర, బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న సమంత..!)


