47 ఏళ్ల వయసులో సంచలనం.. భువనేశ్వర్‌, మలింగ రికార్డు బ్రేక్‌ | 47 Year Old Imran Tahir Creates Magic With 5/17 As Guyana Warriors Bounce Back In CPL 2026, Check Details Inside | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల వయసులో సంచలనం.. భువనేశ్వర్‌, మలింగ రికార్డు బ్రేక్‌

Sep 10 2026 10:16 AM | Updated on Sep 10 2026 11:43 AM

Tahir five-for, Sampsons sixes seal top spot for Guyana Amazon Warriors

PC: CPL

కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో గ‌యానా వారియ‌ర్స్ తిరిగి పుంజుకుంది. గురువారం ప్రొవిడెన్స్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన లీగ్‌ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో గయానా చిత్తు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన వారియర్స్‌.. ఈ విజయంతో తమ అగ్రస్ధానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

ఇక ఈ మ్యాచ్‌లో గయానా కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ 47 వయస్సులోనూ బంతితో అద్భుతం చేశాడు. తన స్పిన్ వలలో చిక్కుకుని సెయింట్ లూసియా కింగ్స్ విలవిల్లాడారు. తహీర్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మరో స్పిన్నర్‌ మెహది హసన్‌ మిరాజ్‌ మూడు వికెట్లు సాధించాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ లూసియా 18.5 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది.

కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో కమిల్‌ పూరన్‌(43), ఓబస్ పీనార్(35) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని వారియర్స్‌ జట్టు 6 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. గయానా బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(37), క్వెంటిన్ శాంప్సన్(37) టాప్‌ స్కోరర్లగా నిలిచారు. ఇక 47 వయస్సులోనూ అద్భుతంగా రాణిస్తున్న తహీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీ20ల్లో తహీర్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం​.

భువీ రికార్డ్‌ బ్రేక్‌
ఈ అద్భుత ప్రదర్శనతో తహీర్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల ఘనత సాధించిన జాబితాలో తహీర్‌ రెండో స్ధానానికి ఎగబాకాడు. తహీర్‌కు ఇది ఆరో ఫైవ్‌ వికెట్‌ హాల్‌. దీంతో దిగ్గజ క్రికెటర్లు భువనేశ్వర్‌ కుమార్‌, లసిత్‌ మలింగ, రషీద్‌ ఖాన్‌,షాహీన్‌ షా అఫ్రిది, షకీబ్‌ అల్‌ హసన్‌లను తహీర్‌ అధిగమించాడు. వీరంతా ఐదుసార్లు ఫైవ్‌ వికెట్‌ హాల్‌ సాధించారు. కాగా జాబితాలో నమీబియా మాజీ పేసర్‌ డేవిడ్‌ వీస్‌(7) అగ్రస్ధానంలో ఉన్నాడు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement