టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్లు వచ్చేస్తున్నారు? | Nitish Reddy likely to get CoE go-ahead, Harshit Rana ruled out of Afghan series | Sakshi
Sakshi News home page

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్లు వచ్చేస్తున్నారు?

Sep 10 2026 11:17 AM | Updated on Sep 10 2026 11:36 AM

Nitish Reddy likely to get CoE go-ahead, Harshit Rana ruled out of Afghan series

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు  డబుల్ గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో వీరిద్దరూ పాసైనట్లు వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరూ గురువారం (సెప్టెంబర్ 10) ఢిల్లీలో భారత జట్టుతో కలవనున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డిన సుంద‌ర్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా తొడ కండరాల గాయం బారిన సుందర్‌.. ఈ కారణంగానే శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

లంకతో తొలి టెస్టు సమయానికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించినప్పటికి.. సీఓఈ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ లభించకపోవడంతో భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక నితీశ్‌ విషయానికి వస్తే.. అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఇంగ్లండ్‌ పర్యటనకు అతడు దూరమయ్యాడు. అనంతరం ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో దాదాపు ఒకటిన్నర నెలలుగా పునరావాసం పొంది పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు.

మరోవైపు యువ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు దూరం కానున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హర్షిత్ రాణా కూడా  హ్యామ్‌స్ట్రింగ్ గాయంతోనే బాధపడుతున్నాడు.

 సెలక్టర్లు అతడు కోలుకుంటాడని భావించి అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోయినట్లు తెలుస్తోంది. ఇక స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అఫ్గాన్‌-భారత్ మధ్య సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement