టీమిండియాలోకి విధ్వంసకర వీరుడు.. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ | Shivam Dube named Nitish Kumar Reddys replacement for India-England ODIs | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాలోకి విధ్వంసకర వీరుడు.. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ

Jul 6 2026 8:33 PM | Updated on Jul 6 2026 8:33 PM

Shivam Dube named Nitish Kumar Reddys replacement for India-England ODIs

ముంబై స్టార్ ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు గాయం కార‌ణంగా దూర‌మైన ఆంధ్ర క్రికెట‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానాన్ని దూబేతో బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ భ‌ర్తీ చేసింది. టీ20 జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా ఉన్న దూబే.. వ‌న్డేల్లో మాత్రం భార‌త్ త‌ర‌పున 2024 ఆగ‌స్టులో ఆడాడు. 

అప్ప‌టి నుంచి కేవ‌లం వ‌న్డేల‌కు మాత్ర‌మే దూబే ప‌రిమిత‌మ‌య్యాడు. కానీ ఇప్పుడు నితీశ్‌కు గాయం కావ‌డంతో ఈ సీఎస్‌కే విధ్వంసకర వీరుడికి వ‌న్డేల్లో పున‌రాగ‌న‌మం చేసే అవ‌కాశం ల‌భించింది. నితీష్ కుమార్ రెడ్డి ప్ర‌స్తుతం తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. దీంతో అత‌డు ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌తో పాటు  జూలై 23 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

ఇంగ్లండ్‌తో వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్య‌ర్‌ (వైస్ కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే.

సంజూపై వేటు
కాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో ఊహించ‌ని మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌పై సెల‌క్ట‌ర్లు వేటు వేశారు. అత‌డి స్ధానంలో పంజాబ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌ను ఎంపిక చేశారు. అదేవిధంగా వైభ‌వ్ సూర్యవంశీని కూడా కొన‌సాగించారు. 

ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతున్న అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలకు విశ్రాంతినిచ్చారు. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్‌లు జట్టులోకి రాగా, ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి  రీ ఎంట్రీ ఇచ్చాడు.

జింబాబ్వేతో టీ20కు భార‌త జ‌ట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement