ఉప్పల్‌లో క్లాసెన్‌, నితీశ్ వీరవిహారం | Heinrich Klaasen, Nitish Reddy Slam Fifties In Century Stand After Top Order Collapse | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉప్పల్‌లో క్లాసెన్‌, నితీశ్ వీరవిహారం

Apr 5 2026 5:38 PM | Updated on Apr 5 2026 5:54 PM

Heinrich Klaasen, Nitish Reddy Slam Fifties In Century Stand After Top Order Collapse

ఐపీఎల్‌-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో క్లాసెన్‌, నితీశ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. తొలుత ఆచితూచి ఆడిన వీరిద్దరూ.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అప్పటివరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో బౌలర్లను వీరిద్దరూ ఉతికారేశారు. ముఖ్యంగా నితీశ్ తన సొంత ప్రేక్షకుల ముందు వీరవిహారం చేశాడు. 

అద్భుతమైన సిక్స్‌లు బాదుతూ అభిమానులు అలరించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న నితీశ్‌ కుమార్‌.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. క్లాసెన్‌ కూడా 41  బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ  ఐదో వికెట్‌కు 116 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 

దీంతో స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ, ప్రిన్స్ యాద‌వ్‌, అవేష్ ఖాన్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. సిద్దార్ద్‌, దిగ్వేష్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.
చదవండి: IPL 2026: నిప్పులు చెరిగిన ష‌మీ.. వ‌ణికిపోయిన ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు

Advertisement
 
Advertisement
Advertisement