కపుల్ రియాలిటీ షో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విజయవంతంగా ముగిసింది.
పది జంటల్ని పది వారాలపాటు మాన్షన్‌లో ఉంచి వారి మధ్య ప్రేమ, సహనం, నమ్మకాన్ని పరీక్షించారు.
ఈ ఆటలో అందర్నీ వెనక్కు నెడుతూ వాసంతి కృష్ణన్- పవన్ కల్యాణ్ జంట ట్రోఫీ గెలిచింది.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్‌తో పాటు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ గెలుపొందింది.


