నిప్పులు చెరిగిన ష‌మీ.. వ‌ణికిపోయిన ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు | Mohammed Shami wreaks havoc against his SRH Team | Sakshi
Sakshi News home page

IPL 2026: నిప్పులు చెరిగిన ష‌మీ.. వ‌ణికిపోయిన ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు

Apr 5 2026 4:46 PM | Updated on Apr 5 2026 4:56 PM

Mohammed Shami wreaks havoc against his SRH Team

ఐపీఎల్‌-2026లో టీమిండియా వెట‌ర‌న్‌, ల‌క్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ష‌మీ నిప్పులు చెరిగాడు.

త‌న సంచ‌ల‌న బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో అద్భుత‌మైన బంతితో అభిషేక్ శ‌ర్మ‌ను బోల్తా కొట్టించిన షమీ.. ఆ తర్వాత మూడో ఓవర్‌లో విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

షమీ మొత్తంగా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడు అద్భుత బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ కేవలం 10 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా షమీని ఈ ఏడాది సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి రూ.10 కోట్ల భారీ ధరకు షమీని లక్నో ట్రేడ్‌ చేసుకుంది. గత సీజన్‌లో షమీ విఫలం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ వదులుకుంది. కానీ ఇప్పుడు తన మాజీ ఫ్రాంచైజీ పైనే షమీ సత్తాచాటాడు.

తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్  
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హైన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్

ఇంపాక్ట్ సబ్స్‌: ఈషాన్ మలింగ, డేవిడ్ పేన్, సలిల్ అరోరా, శివమ్ మావి, జీషాన్ అంసారీ

లక్నో సూపర్ జెయింట్స్ 
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌధరి, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, ఎం. సిద్ధార్థ్

ఇంపాక్ట్ సబ్స్‌ : అన్రిచ్ నోర్కియా, హిమ్మత్ సింగ్, షాహ్‌బాజ్ అహ్మద్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రిట్జ్‌కే
 

Advertisement
 
Advertisement
Advertisement