దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్.. శుక్రవారం మధ్యప్రదేశ్‌తో జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపాడు.
తొలుత బ్యాటింగ్‌లో 25 పరుగులతో సత్తాచాటిన నితీశ్.. అనంతరం బౌలింగ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. 19.1 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో శ్రీకర్ భరత్(39), నితీశ్ రెడ్డి(25) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఎంపీ బౌలర్లలో శివమ్ శుక్లా నాలుగు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ మూడు, రాహుల్ బాథమ్ రెండు వికెట్లు సాధించారు.
నితీశ్ హ్రాట్రిక్ షో..
113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌కు నితీశ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. మూడో ఓవర్ వేసిన నితీశ్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఎంపీని కష్టాల్లోకి నెట్టాడు. నితీష్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా హర్ష్ గవాలి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ తర్వాత డెలివరీకి హర్‌ప్రీత్ సింగ్ రిక్కీ భుయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఇక చివరగా నితీశ్ ఎంపీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రిషబ్ చౌహన్(47), రాహుల్ బాథమ్(35 నాటౌట్) ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆంధ్రపై 4 వికెట్ల తేడాతో ఎంపీ ఘన విజయం సాధించింది.
చదవండి: Asia Cup: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో


