PhD స్టూడెంట్‌తో సహజీవనం.. పెళ్లి బంధంలోకి క్రికెటర్‌ | Cameron Green Married His Longterm Partner Shares Pics Goes Viral | Sakshi
Sakshi News home page

PhD స్టూడెంట్‌తో ఐదేళ్లుగా సహజీవనం.. పెళ్లి బంధంలోకి క్రికెటర్‌

Sep 13 2026 3:11 PM | Updated on Sep 13 2026 3:45 PM

Cameron Green Married His Longterm Partner Shares Pics Goes Viral

PC: Instagram

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామిగా కొనసాగుతున్న ఎమిలీ రెడ్‌వుడ్‌ను సెప్టెంబరు 4న వివాహమాడాడు. ఈ విషయాన్ని గ్రీన్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన గ్రీన్‌.. ‘‘భార్యాభర్తలుగా సెప్టెంబరు 4న ఇలా’’ అంటూ లవ్‌ ఎమోజీని జతచేశాడు. ఈ క్రమంలో కొత్త జంట గ్రీన్‌- ఎమిలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఐదేళ్లుగా సహ జీవనం
గ్రీన్‌- ఎమిలీ ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఆసీస్‌ మీడియా వెల్లడించింది. ఇక గతేడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా అత్యంత సన్నిహితులు, బంధువుల నడుమ పెళ్లి చేసుకున్నారు. పెర్త్‌లో జరిగిన తమ వివాహ వేడుకలో గ్రీన్‌ నల్ల రంగు టక్సిడోలో మెరిసిపోగా.. ఎమిలి తెల్లటి గౌనులో తళుక్కుమంది.

ఎవరీ ఎమిలి?
ఎమిలీ వృత్తి రీత్యా డైటీషియన్‌, న్యూట్రీషియన్‌. ఆమె వైద్య రంగంలో పీహెచ్‌డీ కూడా చేస్తున్నట్లు సమాచారం. గ్రీన్‌ కిడ్నీ సమస్యతో బాధపడినపుడు ఎమిలీ దగ్గరుండి అతడిని చూసుకున్నట్లు తెలుస్తోంది.

కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న వేళ కూడా ఎమిలీ గ్రీన్‌కు మద్దతుగా నిలిచింది. గత ఐదారేళ్లుగా ఇలా ఒకరికి ఒకరై జీవిస్తున్న గ్రీన్‌- ఎమిలీ తమ బంధాన్ని చట్టబద్ధంగా ముందుకు తీసుకువెళ్లారు.

ఆసీస్‌ తరఫున కెరీర్‌ ఇలా
ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్‌ గ్రీన్‌.. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఈ 27 ఏళ్ల ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. 39 టెస్టులు, 37 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 1920, వన్డేల్లో 946, టీ20లలో 638 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.

అదే విధంగా.. ఈ రైటార్మ్‌ పేసర్‌ ఖాతాలో టెస్టుల్లో 39, వన్డేల్లో 21, టీ20లలో 14 వికెట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికి 43 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన గ్రీన్‌.. 1029 పరుగులు చేయడంతో పాటు.. 23 వికెట్లు కూల్చాడు.

ఐపీఎల్‌ వేలం-2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అత్యధికంగా రికార్డు ధర రూ. 25.20 కోట్లకు కామెరాన్‌ గ్రీన్‌ను కొనుగోలు చేయగా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 14 మ్యాచ్‌లు ఆడి 322 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్‌.. ఆస్తి విలువ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement