ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్‌.. ఆస్తి విలువ ఎంతంటే? | From Sachin ₹70-Crore Lonavala Plot To Dhoni 7-Acre Farmhouse, Inside The Lavish Properties Of India’s Cricket Legends | Sakshi
Sakshi News home page

ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్‌.. ‘కైలాష్‌పతి’ ఆస్తి విలువ ఎంతంటే?

Sep 12 2026 11:58 AM | Updated on Sep 12 2026 12:38 PM

India stars Luxury Properties: MS Dhoni 7 Acres Kailashpati Farmhouse

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఇటీవల దాదాపు నాలుగు ఎకరాల భూమి కొన్నట్లు వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలోని ప్రముఖ హిల్‌ స్టేషన్‌ లోనావాలాలో ఈ ముంబైకర్‌ 3.86 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీని విలువ సుమారు రూ. 70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో సచిన్‌తో సహా మిగతా టీమిండియా దిగ్గజాల విలాసవంతమైన జీవనశైలి, ఖరీదైన బంగ్లాలు, నివాస స్థలాలు, వాటి విలువ గురించి మరోసారి చర్చ మొదలైంది. మరి ఆ వివరాలు ఏమిటో మనమూ తెలుసుకుందామా?!

బాంద్రాలో సచిన్‌ లగ్జరీ హౌజ్‌
ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో సచిన్‌ టెండుల్కర్‌కు అద్భుతమైన బంగ్లా ఉంది. ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ ప్రకారం.. 2007లో రూ. 39 కోట్లకు ప్లాట్‌ కొన్న సచిన్‌.. అందులో తన కలల భవనాన్ని నిర్మించుకున్నాడు. దీని విలువ ప్రస్తుతం రూ. 100- 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రోహిత్‌ విలాసవంతమమైన ఇల్లు
రోహిత్‌ శర్మ 2015లో వర్లీలో సుమారు 6000 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశాడు. నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ నివాసం.. అరేబియా సముద్ర తీరముఖం దిశగా ఉంటుంది. దీని విలువ రూ. 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

యువరాజ్‌ సింగ్‌ ఖరీదైన బంగ్లా
చండీగఢ్‌కు చెందిన యువరాజ్‌ సింగ్‌ కుటుంబంతో కలిసి ముంబైలోనే ఎక్కువగా నివాసం ఉంటాడు. వర్లీలో 2013లో అతడు ఓ నివాస సముదాయాన్ని కొనుగోలు చేశాడు. దీనిని విలువ రూ. 64 కోట్లు అని తెలుస్తోంది.

గురుగ్రామ్‌లో కోహ్లి విలాసవంతమైన నివాసం
విరాట్‌ కోహ్లికి గురుగ్రామ్‌లో ఖరీదైన ఆస్తి ఉంది. బిజినెస్‌ టుడే అందించిన వివరాల ప్రకారం.. దీనిని విలువ రూ. 80 కోట్లు ఉంటుందని అంచనా.

ధోని ఏడెకరాల ఫామ్‌హౌజ్‌
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం.. స్వస్థలం రాంచిలో ధోనికి ఏడెకరాల ఫామ్‌హౌజ్‌ ఉంది. దీని పేరు కైలాష్‌పతి. ప్రకృతి రమణీయతతో కూడిన ఈ ప్రశాంతమైన స్థలంలో ధోని, అతడి భార్య సాక్షి, కుమార్తె జీవా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు.

సేంద్రీయ వ్యవసాయం
రాంచి రింగ్‌రోడ్‌కు సమీపంలో ఏడెకరాల స్థలంలో నిర్మించిన ఫామ్‌హౌజ్‌లో ధోని గ్యారేజీ ప్రత్యేకం. స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, క్రికెట్‌ నెట్స్‌ కూడా ఉన్నాయి. ఇక ధోనికి ఇష్టమైన పెంపుడు కుక్కలు చాలానే ఉన్నాయి. ధోని ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. 

స్ట్రాబెర్రీస్‌, జామ, పుచ్చకాయలతో పాటు కూరగాయలు, గోధుమ పండిస్తున్నట్లు తెలుస్తోంది. విశాలమైన స్థలంలో పాత, కొత్త మేళవింపుల శైలితో నిర్మితమైన ఈ ఫామ్‌హౌజ్‌ ధోని ఆస్తుల్లో విలువైనదిగా తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ లెక్కల ప్రకారం రాంచి స్థలం, ఫామ్‌హౌజ్‌ విలువ కలిపి దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement