రేపే మ్యాచ్‌.. అంత‌లోనే డబుల్ సెంచ‌రీ వీరుడికి గాయం! | Navdeep Saini Shares Massive Update On Ishan Kishans Injury Ahead Of IND Vs AFG 1st T20I, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

IND vs AFG: రేపే మ్యాచ్‌.. అంత‌లోనే డబుల్ సెంచ‌రీ వీరుడికి గాయం!

Sep 12 2026 11:39 AM | Updated on Sep 12 2026 12:01 PM

 Saini Shares Massive Update On Ishan Kishans Injury Ahead Of IND Vs AFG 1st T20I

PC: bcci

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌కు గాయ‌ప‌డ్డాడు. తొలి టీ20 కోసం శుక్ర‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా తీవ్రంగా శ్ర‌మించింది. ఈ క్ర‌మంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేస్తుండ‌గా కిష‌న్ న‌డుము నొప్పికి గుర‌య్యాడు. 

నెట్ బౌలర్ నవదీప్ సైనీ విసిరిన ఒక వేగవంతమైన బౌన్సర్‌ను ఎదుర్కొనే క్ర‌మంలో కిష‌న్‌కు ఈ స‌మ‌స్య త‌లెత్తంది. దీంతో అత‌డు ప్రాక్టీస్ మ‌ధ్య‌లోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. కీలక మ్యాచ్‌కు ముందు కిషన్ గాయపడటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ జార్ఖండ్ స్టార్ గాయం తీవ్ర‌త‌పై నెట్ బౌలర్ న‌వ్‌దీప్ సైనీ తాజాగా బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు.

"నేను, ఇషాన్ చాలా కాలంగా క‌లిసి ఆడుతున్నాం. అత‌డి బ‌ల‌హీన‌త‌లు నాకు బాగా తెలుసు. ఈ క్ర‌మంలోనే షార్ట్ బాల్‌తో అత‌డిని ప‌రీక్షించాల‌నుకున్నాను. కానీ అత‌డు ఆ బంతిని ఆడ‌లేక‌పోయాడు. న‌డ‌ము నొప్పి రావ‌డంతో వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత అత‌డి వ‌ద్ద‌కు వెళ్లి ఎలా ఉంద‌ని అడిగాను?. అంతా బాగానే ఉంద‌ని చెప్పాడు. 

కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని సైనీ పేర్కొన్నాడు. కిష‌న్ ప్ర‌స్తుతం ఫిజియో క‌మ‌లేష్ జైన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు. కాగా కిష‌న్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. 

ఇటీవ‌ల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో ఈ జార్ఖండ్ ఆట‌గాడు డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఇక భార‌త్‌-అఫ్గానిస్తాన్ మ‌ధ్య తొలి టీ20 ఆదివారం జ‌ర‌గ‌నుంది. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, సుంద‌ర్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు తిరిగి క‌మ్‌బ్యాక్ ఇచ్చారు.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌.. 131 ఏళ్లలో ఒకే ఒక్కడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement