'వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ద్దు.. అత‌డే బెట‌ర్‌' | No vaibhav Sooryavanshi As Rahane Picks Indias Top 3 For Afghanistan T20I Series | Sakshi
Sakshi News home page

IND vs AFG: 'వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ద్దు.. అత‌డే బెట‌ర్‌'

Sep 12 2026 9:50 AM | Updated on Sep 12 2026 9:50 AM

No vaibhav Sooryavanshi As Rahane Picks Indias Top 3 For Afghanistan T20I Series

PC: bcci

భార‌త్-అఫ్గానిస్తాన్ మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదిక‌గా ఆదివారం (సెప్టెంబ‌ర్ 13) జ‌ర‌గ‌నుంది. అయితే స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ జట్టులోకి తిరిగి రావ‌డంతో, భార‌త తుది జ‌ట్టు కూర్పు ఎలా ఉండ‌బోతుంద‌న్న ఆస‌క్తి అంద‌రిలో నెలకొంది. 

ఎందుకంటే యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ రాక‌ముందు భార‌త రెగ్యుల‌ర్ ఓపెన‌ర్లగా శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌లు వ్యవహరించారు. ఐర్లాండ్ టూర్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌లో సంజూ తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మం కావ‌డంతో అత‌డిని తుది జ‌ట్టు నుంచి త‌ప్పించారు. సంజూ స్ధానంలో వైభ‌వ్‌కు అవ‌కాశ‌మిచ్చారు. 

ఈ బిహార్ ఆట‌గాడు కూడా తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. దీంతో ఆఖ‌రి టీ20కు వైభ‌వ్‌ను ప‌క్క‌న పెట్టి శాంస‌న్‌ను తిరిగి జ‌ట్టులోకి తీసుకొచ్చారు. ఈ కేర‌ళ ఆట‌గాడు 14 బంతుల్లో 27 ప‌రుగులు సాధించి జ‌ట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అనంత‌రం జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు శాంస‌న్‌కు విశ్రాంతిని ఇచ్చి వైభ‌వ్‌ను ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దించారు. 

ఈ సిరీస్‌లో మాత్రం వైభ‌వ్ దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌ల‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ సంజూ స్క్వాడ్‌లోకి తిరిగి రావడంతో టీమ్ మేనెజ్‌మెంట్ ఓపెనర్‌గా ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మాజీ కెప్టెన్ అజింక్య రహానే టాప్-3 ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఇందులో వైభవ్‌కు చోటు దక్కలేదు.

"టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ముగ్గురు బ్యాటర్లనే అఫ్గాన్‌ సిరీస్‌లో కూడా టాప్‌-3లో కొనసాగించాలి. వరల్డ్‌కప్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ రెండు, మూడు ఇన్నింగ్స్‌లలో విఫలం కావడంతో అతడిని పక్కన పెట్టారు. ఇది సరైన నిర్ణయం కాదు. అతడికి మరో అవకాశం ఇవ్వాలి. 

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించాలి. అయితే వైభవ్ మంచి ప్లేయర్ ఎలాంటి సందేహం లేదు. అతడికి భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం  శాంసన్, అభిషేక్, ఇషాన్‌లు టాప్‌-3లో ఉండాలి" అని తన యూట్యూబ్ ఛానల్‌లో రహానే పేర్కొన్నాడు.
చదవండి: వైభవ్‌కు చుక్కలు చూపించిన జస్ప్రీత్‌ బుమ్రా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement