సీఎస్‌కేలో వాటా కావాలని ధోని అడగలేదు..! | CSK deny Dhoni bid to buy a stake, but he owns some shares anyway | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేలో వాటా కావాలని ధోని అడగలేదు..!

Sep 11 2026 5:16 PM | Updated on Sep 11 2026 5:31 PM

CSK deny Dhoni bid to buy a stake, but he owns some shares anyway

source: X

చెన్నై సూపర్ కింగ్స్‌లో వాటా కొనుగోలు చేయాలని ఎంఎస్ ధోని ప్రయత్నించారంటూ వస్తున్న వార్తలను ఆ ఫ్రాంచైజీ ఉన్నతాధికారి ఖండించారు. ధోని ఈ విషయమై తమను ఎప్పుడూ సంప్రదించలేదని, దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సదరు అధికారి సీఎస్‌కేలో వాటా కోసం ధోని ప్రయత్నించలేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఆ ఫ్రాంచైజీలో ధోనికి లక్షకు పైగా షేర్లు ఉన్నాయని సమాచారం.

సీఎస్‌కే ఒక అన్‌లిస్టెడ్ కంపెనీ కావడంతో షేర్లు స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ కావు. కానీ ప్రైవేట్‌గా ఆఫ్-మార్కెట్ లావాదేవీల ద్వారా వాటిని కొనుగోలు చేయవచ్చు. ప్రజల వద్ద సీఎస్‌కేకు సంబంధించిన 30 కోట్లకు పైగా షేర్లు ఉన్నట్లు సమాచారం. ఇది ఆ ఫ్రాంచైజీ క్యాపిటల్‌లో దాదాపు 40 శాతం. మిగతా 55 శాతం వాటా ఫ్రాంచైజీ సీఈవో శ్రీనివాసన్ కుటుంబం కలిగి ఉంది.

ధోనిదే కీలక పాత్ర
కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ సీఎస్‌కేలో ధోని ప్రభావం కొనసాగుతోంది. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా.. తదుపరి కోచ్ ఎంపిక విషయంలో అతడి నిర్ణయానికి మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇస్తోంది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్న ధోని సెప్టెంబర్ 22 ప్రాంతంలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎస్‌కే మేనేజ్‌మెంట్ సమావేశమై కొత్త హెడ్ కోచ్‌ను ఖరారు చేయడంతో పాటు ఆటగాళ్ల ట్రేడ్లు, బదిలీలపై చర్చించనుంది.

సీఎస్‌కే అధికారికంగా కోచ్‌ను ఖరారు చేయలేదని చెబుతున్నప్పటికీ.. ఓ విదేశీ అభ్యర్థిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ధోని తిరిగొచ్చాక ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చదవండి: నన్నే పక్కన పెడతారా? 10 వికెట్లతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్!


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement