శ్రీలంక జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్ ఎవ‌రో తెలీదు | Sri Lanka Squad For Asian Games 2026 Announced | Sakshi
Sakshi News home page

Asian Games 2026: శ్రీలంక జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్ ఎవ‌రో తెలీదు

Sep 12 2026 12:06 PM | Updated on Sep 12 2026 12:06 PM

Sri Lanka Squad For Asian Games 2026 Announced

PC: SLC

జ‌పాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఆసియా క్రీడ‌ల కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ క్రీడ‌ల‌కు బీసీసీఐ, పీసీబీలు త‌మ పూర్తి స్దాయి జ‌ట్ల‌ను పంపుతుంటే.. శ్రీలంక మాత్రం త‌మ ద్వితీయ శ్రేణి జ‌ట్టును ఎంపిక చేసింది.

శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్‌, స్టార్ ఓపెన‌ర్ పాథుమ్ నిస్సాంక‌, వ‌నిందు హ‌స‌రంగా, క‌మిందు మెండీస్‌, ప‌తిరానా, తీక్ష‌ణ‌ వంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్లను సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న పెట్టారు.  నువాన్ తుషార, బినుర ఫెర్నాండో , దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్ వంటి కొంత‌మంది రెగ్యులర్ ఆట‌గాళ్ల‌కే ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది. 

అయితే దాదాపు ఐదేళ్ల త‌ర్వాత వెట‌ర‌న్ వికెట్ కీప‌ర్ నిరోషన్ డిక్వెల్లాకు శ్రీలంక టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కింది. అత‌డితో పాటు ఆల్‌రౌండ‌ర్ చ‌మిక క‌రుణ‌ర‌త్నే కూడా సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. లంకా ప్రీమియ‌ర్ లీగ్‌లో రాణించిన ల‌సిత్ క్రూస్‌పుల్లె, సహన్ అరచ్చిగే, తరిందు హసంక, వనుజ సహన్ కుమార, కేశన్ తత్సర వంటి యువ ఆట‌గాళ్ల‌కు సెల‌క్ట‌ర్లు జాతీయ జ‌ట్టులో చోటు క‌ల్పించారు. 

అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి.. అధికారికంగా కెప్టెన్ పేరును మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. టోర్న‌మెంట్‌కు కెప్టెన్ ఖరారు చేసే అవ‌కాశ‌ముంది. డిక్వెల్లా జట్టును ముందుండి నడిపించ‌నున్న‌ట్లు శ్రీలంక క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా ఈ ఏషియ‌న్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు సెప్టెంబ‌ర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

2026 ఆసియా క్రీడల కోసం శ్రీలంక జట్టు
నిరోషన్ డిక్వెల్లా, చమిక కరుణరత్నే, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, అషెన్ బండార, నువానీదు ఫెర్నాండో, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, విజయకాంత్ వియస్కాంత్, లసిత్ క్రూస్పుల్లే, సహన్ అరాచ్చిగే, తరిందు హసంక, వనుజ సహన్ కుమార, కేషన్ తత్సర డి లివెరా, సినీత్ జయవర్దన
చదవండి: IND vs AFG: రేపే మ్యాచ్‌.. అంత‌లోనే డబుల్ సెంచ‌రీ వీరుడికి గాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement