ఆసియా క్రీడల్లో బాస్కెట్‌బాల్ పోటీలు షురూ
19న ఏషియన్ గేమ్స్ అధికారికంగా ప్రారంభం
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కాకపోయినా... కొన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. జపాన్ వేదికగా ఈ నెల 19 నుంచి ఏషియన్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా... బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, క్రికెట్, హాకీ, మోడర్న్ పెంటాథ్లాన్ క్రీడల్లో పోటీలు ముందే మొదలవుతున్నాయి. ప్రధాన పోటీల ప్రారంభానికి తొమ్మిది రోజుల ముందు గురువారం పురుషుల బాస్కెట్‌బాల్‌లో ఖతార్ జట్టు ఇరాన్‌పై విజయం సాధించింది.
గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో ఖతార్ 59–35 పాయింట్ల తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మంది అథ్లెట్లు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 43 క్రీడాంశాల్లో 17 వేల మందికి పైగా అథ్లెట్లు, క్రీడాధికారులు భాగస్వాములు కానున్నారు. సెపె్టంబర్ 19న క్రీడల ఆరం¿ోత్సవం నిర్వహించనుండగా... మరుసటి రోజు నుంచి పతక పోటీలు జరుగుతాయి.
1994 తర్వాత తొలిసారి జపాన్ ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తుండగా... అనేక క్రీడాంశాల్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు ఈ పోటీలు అర్హత ప్రమాణాలు కానున్నాయి. అయితే ప్రస్తుతం జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అథ్లెట్లకు ఇబ్బందులు తప్పేలాలేవు. మంగళవారం భారీ వర్షం కారణంగా అథ్లెట్ల ప్రాక్టీస్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు కొనసాగనున్నాయి. భారత యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మర్ యూ జిది, ఫిలిప్పైన్ టెన్నిస్ సంచలనం అలెగ్జాండ్రా ఇయాలా ఈ క్రీడల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.


