భారత్‌తో మ్యాచ్‌కు వినిసియస్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్‌లో భారత జట్టుతో జరిగే అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొనే బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన బ్రెజిల్ జట్టులో స్టార్ ఆటగాళ్లు వినిసియస్ జూనియర్, రఫినా, మార్కినోస్‌లను ఎంపిక చేయడం విశేషం. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో వినిసియస్ నాలుగు గోల్స్ సాధించి బ్రెజిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం వేదికగా అక్టోబర్ 3న భారత్, బ్రెజిల్ సీనియర్ జట్ల మధ్య తొలిసారి ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు బ్రెజిల్ జట్టు ఆ్రస్టేలియాలో పర్యటిస్తుంది. బ్రెజిల్, ఆ్రస్టేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 25న తొలి మ్యాచ్, సెపె్టంబర్ 29న రెండో మ్యాచ్ జరుగుతుంది.


