source: BCCI X
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్లనే యధాతథంగా కొనసాగించారు.
షఫాలీ విధ్వంసం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓ మోస్తరు స్కోర్‌కే (149-6) పరిమితమైంది. స్టార్ ప్లేయర్, ఓపెనర్ స్మృతి మంధన (2) త్వరగా ఔటైనా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగింది.
మిగతా ప్లేయర్లలో ప్రతీకా రావల్ 20 (24 బంతుల్లో ఫోర్, సిక్సర్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 24 (నాటౌట్), రిచా ఘోష్ 21 (16 బంతుల్లో 2 సిక్సర్లు), దీప్తి శర్మ 13 (6 బంతుల్లో ఫోర్, సిక్సర్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా అక్తర్ 2, రబెయా ఖాన్, మరుఫా అక్తర్, నహిద అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.
తుది జట్లు..
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(w), ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మ
బంగ్లాదేశ్: దిలారా అక్తర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా(w/c), షర్మిన్ అక్తర్, షోర్నా అక్తర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్తర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్తర్
చదవండి: ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. మూడో టెస్ట్‌లోనూ పాక్‌కు మూడినట్టే..!


