breaking news
Niroshan Dickwella
-
శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలీదు
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ క్రీడలకు బీసీసీఐ, పీసీబీలు తమ పూర్తి స్దాయి జట్లను పంపుతుంటే.. శ్రీలంక మాత్రం తమ ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది.శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్, స్టార్ ఓపెనర్ పాథుమ్ నిస్సాంక, వనిందు హసరంగా, కమిందు మెండీస్, పతిరానా, తీక్షణ వంటి సీనియర్ ప్లేయర్లను సెలక్టర్లు పక్కన పెట్టారు. నువాన్ తుషార, బినుర ఫెర్నాండో , దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్ వంటి కొంతమంది రెగ్యులర్ ఆటగాళ్లకే ఈ జట్టులో చోటు దక్కింది. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత వెటరన్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు శ్రీలంక టీ20 జట్టులో చోటు దక్కింది. అతడితో పాటు ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. లంకా ప్రీమియర్ లీగ్‌లో రాణించిన లసిత్ క్రూస్‌పుల్లె, సహన్ అరచ్చిగే, తరిందు హసంక, వనుజ సహన్ కుమార, కేశన్ తత్సర వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు జాతీయ జట్టులో చోటు కల్పించారు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికి.. అధికారికంగా కెప్టెన్ పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. టోర్నమెంట్‌కు కెప్టెన్ ఖరారు చేసే అవకాశముంది. డిక్వెల్లా జట్టును ముందుండి నడిపించనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.2026 ఆసియా క్రీడల కోసం శ్రీలంక జట్టునిరోషన్ డిక్వెల్లా, చమిక కరుణరత్నే, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, అషెన్ బండార, నువానీదు ఫెర్నాండో, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, విజయకాంత్ వియస్కాంత్, లసిత్ క్రూస్పుల్లే, సహన్ అరాచ్చిగే, తరిందు హసంక, వనుజ సహన్ కుమార, కేషన్ తత్సర డి లివెరా, సినీత్ జయవర్దనచదవండి: IND vs AFG: రేపే మ్యాచ్.. అంతలోనే డబుల్ సెంచరీ వీరుడికి గాయం! -
‘దమ్ముంటే సెంచరీ చెయ్యు’.. లంక ప్లేయర్‌కు జురెల్ స్ట్రోక్!
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 99 నుంచి 100 పరుగుల మార్క్ అందుకోవడానికి 22 బంతులాడినప్పటికీ, మరిచిపోలేని అనుభూతిని పొందాడు. సెంచరీ సెలబ్రేషన్లో కండల ప్రదర్శన చేయడంపై వివరణ ఇచ్చిన ధ్రువ్ జురెల్ మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నాడు. తాను సెంచరీ చేయడం వెనుక లంక ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా కూడా ఒక కారణమని జురెల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జురెల్ మాట్లాడుతూ.. ‘‘నేను క్రీజులోకి వచ్చిన వెంటనే డిక్వెల్లా నీకు దమ్ముంటే ఇక్కడ సెంచరీ చేసి చూపించు. కానీ నువ్వు అది చేయలేవు అని సవాల్ విసిరాడు. కానీ ఆ క్షణంలో నేనేమీ మాట్లాడలేదు. నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్పాలని అనుకున్నా. నేను అనుకున్నట్లుగానే ఓపికను ప్రదర్శించి అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాను. ఆ తర్వాత డిక్వెల్లా దగ్గరకు వెళ్లి నువ్వు అడిగింది నేను చేసి చూపించాను.. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాను. కానీ అతడి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు.’’ అని చెప్పుకొచ్చాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.This DJ’s got some crazy drops! 🎧💯Second Test ton for Dhruv Jurel, with a little late drama for good measure! 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EPPFd2doQS— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026Read: సెంచరీ సెలబ్రేషన్.. కండల ప్రదర్శనపై జురెల్ స్పందన! -
నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టు: జైస్వాల్
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన చర్యతో వార్తల్లో నిలిచాడు. లంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను స్లెడ్జ్ చేసి.. అతడి ఏకాగ్రతను దెబ్బతీయడంలో జైసూ సఫలమయ్యాడు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు డిక్వెల్లా స్టెడ్జింగ్‌కు పాల్పడగా.. ఐదో రోజు ఆటలో జైస్వాల్ ఈ మేరకు ప్రతీకారం తీర్చుకున్నాడు.అసలేం జరిగిందంటే.. గాలె టెస్టులో టీమిండియా విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆది నుంచే తడబడింది. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగు రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 84 పరుగులే చేసింది.ధనంజయ, దినుష పోరాటంఅయితే, కెప్టెన్ ధనంజయ డి సిల్వ (59), సొనాల్ దినుష (84) కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుధవారం లంచ్‌కు ముందు రవీంద్ర జడేజా ధనంజయను అవుట్ చేయగా.. అతడి స్థానంలో నిరోషన్ డిక్వెల్లా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అతడిని స్లెడ్జ్ చేశాడు.లంక రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ ప్రసిద్ కృష్ణ 60వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగగా.. ఐదో బాల్‌కు డిక్వెల్లా రెండు పరుగులు తీశాడు. అప్పుడు స్వ్కేర్ లెగ్ ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న జైస్వాల్.. డిక్వెల్లాను మాటల్లో పెట్టాడు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..The art of on-field sledging, decoded! 🗣️🔥Ajay Jadeja breaks down Yashasvi Jaiswal’s hilarious yet effective mind games that led directly to a crucial breakthrough! 🎯Watch #SLvIND 2nd Test, starting 23rd August 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony… pic.twitter.com/dpTjsar1Qz— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టుజైస్వాల్: కమాన్ యార్.. తొలి ఇన్నింగ్స్‌లో బాగానే షాట్లు కొట్టావు కదా.. ఇప్పుడు కూడా అలాంటిదేదో కావాలి. కమాన్..డిక్వెల్లా: అవునా?జైస్వాల్: అవును. నువ్వు షాట్లు కొడుతుంటే చూడాలనుకుంటున్నాను. చేసి చూపించు మరి. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదు.డిక్వెల్లా: ఆ అవసరం ఇప్పుడు లేదు. నన్ను ఐపీఎల్‌కు తీసుకువెళ్లు. అక్కడ సిక్సర్లు బాదుతా.జైస్వాల్: కచ్చితంగా వంద శాతం తీసుకెళ్తా. ఇప్పుడైతే సిక్సర్ కొట్టు. నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.డిక్వెల్లా: ధన్యవాదాలు.ఇలా డిక్వెల్లా (10)ను జైస్వాల్ స్లెడ్జ్ చేయగా.. మరుసటి బంతికే అతడు వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా శ్రీలంకతో తొలి టెస్టులో జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.చదవండి: శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా -
జైస్వాల్ ఏంటా పిచ్చి షాట్లు? రిపీటయితే అడ్రస్ గల్లంతే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనకు అచ్చిరాని షాట్ ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో జైస్వాల్ డకౌట్ కావడం ఇది ఏడోసారి. అశితా ఫెర్నాండో బంతిని స్టంప్ అవతల వేయగా, అనవసరంగా కట్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే స్పందించిన కీపర్ డిక్వెల్లా ఎలాంటి తప్పు చేయకుండా ఎడ్జ్ తీసుకొని బంతిని అందుకున్నాడు. పేస్ బౌలింగ్‌లో కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ తరచూ విఫలమవుతున్నాడు. అయితే ఇదే జైస్వాల్ తన డెబ్యూ టూర్ ఇంగ్లండ్ సిరీస్‌లో 293 పరుగులు చేసి నాలుగుసార్లు మాత్రమే ఔటయ్యాడు. 2025 నుంచి చూసుకుంటే మాత్రం కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో కేవలం 47 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్ నాలుగుసార్లు ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో తప్పుడు షాట్ల రేటు 31 శాతం నుంచి 48 శాతానికి పెరగడం గమనార్హం. అసలే టీమిండియా ఓపెనింగ్ స్లాట్‌కు పోటీ పెరిగిపోతున్న వేళ జైస్వాల్ విఫలమవ్వడం అతడి స్థానానికి ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే వన్డే, టీ20 జట్టులో తీవ్ర పోటీ కారణంగా జైస్వాల్‌కు జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే త్వరలో ఇక్కడ కూడా చోటు కోల్పోవడం ఖాయం. పైగా సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి క్రికెటర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడంతో సాయి సుదర్శన్ రెండో టెస్టు ఆడే అవకాశముంది. దీంతో రెండో టెస్టుకు జట్టు నుంచి సాయికి అవకాశమివ్వాలనుకుంటే జైస్వాల్‌ను తప్పించే చాన్స్ ఎక్కువగా ఉంటుంది."Yashasvi jaiswal Got out on 0 runs 😢He is good batsmen but he needs to be consistent.#SLvIND pic.twitter.com/q7cQeFsMch— Indian Cricket Team (@criclover451807) August 18, 2026Read: సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం! -
సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం!
గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, లంక బ్యాటర్లు డిక్వెల్లా, దినూషలు తమ జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవర్లో ఇది చోటచేసుకుంది. 54వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ డిక్వెల్లా బ్యాట్‌ను టార్గెట్‌గా చేసుకొని అదే పనిగా బంతులను విసిరాడు. పదే పదే తనను రెచ్చగొట్టేలా బంతులు వేయడంతో సహనం కోల్పోయిన డిక్వెల్లా సిరాజ్‌తో మాటల యుద్ధానికి దిగాడు. 'బంతులను సరిగ్గా వెయ్యు' అని డిక్వెల్లా అనగా.. సిరాజ్ 'సరే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్రతిస్పందించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరిని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోషన్ డిక్వెల్లా మంచి ప్రదర్శనే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించిన అనంతరం ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డిక్వెల్లా కెరీర్లో ఇది 23వ అర్ధశతకం. అయితే 55 టెస్టులాడినప్పటికీ డిక్వెల్లా ఖాతాలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అతడి అత్యధిక టెస్టు స్కోరు 96గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం లభించింది. సోనాల్ దినూష (100) సెంచరీ చేయగా, డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా, జడేజా మూడు, కుల్దీప్, ప్రసిధ్, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. పడిక్కల్ సెంచరీతో చెలరేగగా, కేఎల్ రాహుల్, జురెల్ అర్ధశతకాలు సాధించారు.🚨 Heated exchange between Mohammed Siraj & Niroshan Dickwella during the live match 🚨Mohammed Siraj was continuously beating Dickwella’s bat with his deliveries and kept troubling the Sri Lankan batter.After Dickwella appeared to lose his cool, the two players were involved… pic.twitter.com/kvGVWVo1sK— Central Cricket (@arshdeep3444) August 17, 2026 -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేయగలిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (4), కమిందు మెండిస్ (14) విఫలం కాగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో 99 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఆరో నంబర్ బ్యాటర్ సొనాల్ దినుష, వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ పట్టుదలగా నిలబడి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో డిక్విల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. సొనాల్ దినుషతో కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ క్రమంలో సొంతగడ్డ మీద టీమిండియాతో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. దినుష సెంచరీ చేసి అవుటయ్యాడు.స్వదేశంలో భారత్‌తో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రీలంక జోడీలు1. సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా- 146 పరుగులు2. ఏంజెలో మాథ్యూస్- కుశాల్ పెరీరా- 135 పరుగులు3. దినేశ్ చండిమాల్- లాహిరు తిరిమన్నె- 125 పరుగులు4. మహేళ జయవర్దనె- హషాన్ తిలకరత్నె- 95 పరుగులు5. టీఎల్ దిల్షాన్- ప్రసన్న జయవర్దనె- 91 పరుగులు.


