Photo Credit: BCCI Twitter
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనకు అచ్చిరాని షాట్ ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో జైస్వాల్ డకౌట్ కావడం ఇది ఏడోసారి. అశితా ఫెర్నాండో బంతిని స్టంప్ అవతల వేయగా, అనవసరంగా కట్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే వెంటనే స్పందించిన కీపర్ డిక్‌వెల్లా ఎలాంటి తప్పు చేయకుండా ఎడ్జ్ తీసుకొని బంతిని అందుకున్నాడు. పేస్ బౌలింగ్‌లో కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ తరచూ విఫలమవుతున్నాడు. అయితే ఇదే జైస్వాల్ తన డెబ్యూ టూర్ ఇంగ్లండ్ సిరీస్‌లో 293 పరుగులు చేసి నాలుగుసార్లు మాత్రమే ఔటయ్యాడు.

2025 నుంచి చూసుకుంటే మాత్రం కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో కేవలం 47 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్ నాలుగుసార్లు ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో తప్పుడు షాట్ల రేటు 31 శాతం నుంచి 48 శాతానికి పెరగడం గమనార్హం. అసలే టీమిండియా ఓపెనింగ్ స్లాట్‌కు పోటీ పెరిగిపోతున్న వేళ జైస్వాల్ విఫలమవ్వడం అతడి స్థానానికి ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు.
ఇప్పటికే వన్డే, టీ20 జట్టులో తీవ్ర పోటీ కారణంగా జైస్వాల్‌కు జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే త్వరలో ఇక్కడ కూడా చోటు కోల్పోవడం ఖాయం. పైగా సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి క్రికెటర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది.
సాయి సుదర్శన్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడంతో సాయి సుదర్శన్ రెండో టెస్టు ఆడే అవకాశముంది. దీంతో రెండో టెస్టుకు జట్టు నుంచి సాయికి అవకాశమివ్వాలనుకుంటే జైస్వాల్‌ను తప్పించే చాన్స్ ఎక్కువగా ఉంటుంది.
"Yashasvi jaiswal Got out on 0 runs 😢
He is good batsmen but he needs to be consistent.#SLvIND pic.twitter.com/q7cQeFsMch— Indian Cricket Team (@criclover451807) August 18, 2026


