Photo Credit: BCCI Twitter
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 99 నుంచి 100 పరుగుల మార్క్ అందుకోవడానికి 22 బంతులాడినప్పటికీ, మరిచిపోలేని అనుభూతిని పొందాడు. సెంచరీ సెలబ్రేషన్‌లో కండల ప్రదర్శన చేయడంపై వివరణ ఇచ్చిన ధ్రువ్ జురెల్ మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నాడు.
తాను సెంచరీ చేయడం వెనుక లంక ఆటగాడు నిరోషన్ డిక్‌వెల్లా కూడా ఒక కారణమని జురెల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జురెల్ మాట్లాడుతూ.. ‘‘నేను క్రీజులోకి వచ్చిన వెంటనే డిక్‌వెల్లా నీకు దమ్ముంటే ఇక్కడ సెంచరీ చేసి చూపించు. కానీ నువ్వు అది చేయలేవు అని సవాల్ విసిరాడు.
కానీ ఆ క్షణంలో నేనేమీ మాట్లాడలేదు. నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్పాలని అనుకున్నా. నేను అనుకున్నట్లుగానే ఓపికను ప్రదర్శించి అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాను. ఆ తర్వాత డిక్‌వెల్లా దగ్గరకు వెళ్లి నువ్వు అడిగింది నేను చేసి చూపించాను.. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాను. కానీ అతడి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు.’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.
This DJ’s got some crazy drops! 🎧💯
Second Test ton for Dhruv Jurel, with a little late drama for good measure! 😮💨
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EPPFd2doQS— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026


