నిరాశ‌ప‌రిచిన భార‌త్‌.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట | India Knocked-Out Hockey WC 2026-Loss Vs-Argentina-Failed Qualify Semis | Sakshi
Sakshi News home page

నిరాశ‌ప‌రిచిన భార‌త్‌.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట

Aug 24 2026 8:07 PM | Updated on Aug 24 2026 8:22 PM

India Knocked-Out Hockey WC 2026-Loss Vs-Argentina-Failed Qualify Semis

Photo Credit: Twitter

హాకీ ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త పురుషుల జ‌ట్టు ఆట ముగిసింది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓట‌మి చ‌విచూసిన భార‌త్ ఇంటిబాట ప‌ట్టింది. పూల్‌-ఇలో భాగంగా అర్జెంటీనా చేతిలో 5-3 తేడాతో భార‌త్ ఓటమిని చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో మొదటి క్వార్టర్‌లో మూడు గోల్స్ నమోదయ్యాయి. 

అర్జెంటీనా రెండు గోల్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, భారత్ ఒక గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించింది. కేవలం 39 సెకన్లలోనే అర్జెంటీనా ఆటగాడు జోక్విన్ టోస్కాని తొలి గోల్ చేయగా, కొన్ని నిమిషాల తర్వాత నికోలస్ డి లా టోర్రే మ‌రో గోల్ కొట్టి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. అయితే భారత్ త‌ర‌ఫున సుఖ్‌జీత్ సింగ్ భారత్ తరఫున తొలి గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు.  

ఇక మూడో క్వార్టర్‌లో టోమాస్ డోమెన్ అర్జెంటీనా తరఫున మ‌రో రెండు గోల్స్ సాధించి జ‌ట్టు ఆధిక్యాన్ని 4-1కి పెంచాడు. చివ‌రి క్వార్టర్‌లో టొస్కానీ మ‌రో గోల్ కొట్ట‌డంతో ఆ జ‌ట్టు గోల్స్ సంఖ్య ఐదుకు పెరిగింది. ఆఖ‌ర్లో సుఖ్జీజ్ మ‌రో గోల్‌తో మెరవ‌డంతో ఆధిక్యం 5-2కు త‌గ్గింది. మ‌రో నిమిషంలో ఆట ముగ‌స్తుంద‌న‌గా భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ ల‌భించింది. దీనిని స‌ద్వినియోగం చేసుకుంటూ సుఖ్‌జీత్ సింగ్ గోల్‌గా మ‌లిచిన‌ప్ప‌టికీ అప్ప‌టికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. 

అటు ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా మహిళల జట్టు కూడా సెమీఫైనల్‌కు చేరలేకపోయింది. రెండో దశలో భాగంగా ఆ్రస్టేలియాతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ రెండో మ్యాచ్‌ను సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది. గోల్స్‌ అంతరంలో భారత్, ఆస్ట్రేలియాలకంటే చైనా (–3) వెనుకబడి సెమీఫైనల్‌కు దూరమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement