హ‌ద్దుమీరిన‌ జైస్వాల్‌; ఇది రెండోసారి.. నిషేధం తప్పదా? | ICC Will-Punish-Jaiswal-Again-After-Lahiru Wicket-Aggressive Celebration | Sakshi
Sakshi News home page

హ‌ద్దుమీరిన‌ జైస్వాల్‌; ఇది రెండోసారి.. నిషేధం తప్పదా?

Aug 24 2026 7:43 PM | Updated on Aug 24 2026 7:49 PM

ICC Will-Punish-Jaiswal-Again-After-Lahiru Wicket-Aggressive Celebration

Photo Credit: BCCI Twitter

టీమిండియా ఓపెన‌ర్‌ య‌శ‌స్వి జైస్వాల్ మ‌రోసారి లంక ఆట‌గాళ్ల‌ను రెచ్చ‌గొట్టే చ‌ర్య‌తో వివాదంలో చిక్కుకున్నాడు. లంక ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఆ జ‌ట్టు వికెట్ ప‌డిన సంద‌ర్భంలో జైస్వాల్ శ్రుతిమించిపోయాడు. ప్ర‌సిధ్ క్రిష్ణ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవ‌ర్‌లో లాహిరు ఉదారా ఔట‌య్యాడు. 

ఇన్‌స్వింగ‌ర్ అయిన బంతిని లాహిరు ఉదారా డిఫెన్స్ చేసే ప్ర‌య‌త్నంలో అత‌డి బ్యాట్ ఎడ్జ్‌కు త‌గిలింది. మూడో స్లిప్‌లో ఉన్న జైస్వాల్ వైపు బంతి దూసుకెళ్లింది. అంతే వేగంగా స్పందించిన‌ జైస్వాల్ కుడివైపుకు పూర్తిగా డైవ్ చేసి అద్భుత‌రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ, అస‌లు క‌థ ఇక్క‌డే మొద‌లైంది. 

లాహిరు ఉదారా క్యాచ్ ప‌ట్టిన జైస్వాల్ గ‌ట్టిగా అరుస్తూ బంతిని గాల్లోకి విసిరాడు. అంత‌టితో ఆగ‌కుండా లంక బ్యాట‌ర్‌ను ఉద్దేశించి మాట‌ల తూటాలు వ‌దిలి మ‌రోసారి ఐసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా నిబంధ‌న‌లను ఉల్ల‌ఘించాడు.  ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఆట స్ఫూర్తికి విరుద్ధంగా, దూకుడుగా లేదా అనుచితంగా సంబరాలు చేసుకునే ఆటగాళ్లు హద్దులు దాటి, అవుటైన బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా ప్ర‌వ‌ర్తిస్తే స‌ద‌రు ఆట‌గాళ్ల‌ను ఐసీసీ శిక్షిస్తుంది.

ఆర్టికల్ 2.5 ప్రకారం, బ్యాటర్ అవుటైన తర్వాత అతని నుంచి తీవ్రమైన ప్రతిచర్యను రేకెత్తించే విధంగా ఆటగాళ్లు భాష, చర్యలు లేదా సంజ్ఞలను ఉపయోగించడాన్ని ఐసీసీ ఉపేక్షించ‌దు. బ్యాటర్‌కు దగ్గరగా అతి ఉద్వేగభరితంగా లేదా దూకుడుగా సెండ్-ఆఫ్ చేయడం, లేదా ఆటగాడి ముఖం వద్దకు పరుగెత్తుకు వెళ్లడం వంటివి లెవెల్ 1 ఉల్లంఘన కింద‌కు వ‌స్తోంది. దీని ఫలితంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 15 నుంచి 50 శాతం వరకు జరిమానాతో పాటు అదనపు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడవచ్చు.

ఇప్ప‌టికే తొలి ఇన్నింగ్స్ స‌మ‌యంలో అసితా ఫెర్నాండో కార‌ణంగా ఐసీసీ నుంచి జ‌రిమానా ఎదుర్కొన్న జైస్వాల్‌ను తాజా వివాదం ఎక్క‌డిదాకా తీసుకెళ్తుందో చూడాలి. ఒక‌వేళ జైస్వాల్ చ‌ర్య‌ను ఐసీసీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మాత్రం జైస్వాల్‌కు ఈసారి భారీ జ‌రిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.

 

Read: దులీప్‌ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌ బౌలర్‌ సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement