యశస్వి జైశ్వాల్‌ సంచలన క్యాచ్‌.. బిత్తర పోయిన లంక్‌ బ్యాటర్‌ | Yashasvi Jaiswal takes a brilliant diving catch at slip during 2nd Test vs Sri Lanka | Sakshi
Sakshi News home page

IND vs SL: యశస్వి జైశ్వాల్‌ సంచలన క్యాచ్‌.. బిత్తర పోయిన లంక్‌ బ్యాటర్‌

Aug 24 2026 6:57 PM | Updated on Aug 24 2026 6:59 PM

Yashasvi Jaiswal takes a brilliant diving catch at slip during 2nd Test vs Sri Lanka

PC: X

కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్‌ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(117), ధ్రువ్‌ జురెల్‌(115) సెంచరీలతో కదం తొక్కగా.. రిషబ్‌ పంత్‌(63), యశస్వి జైశ్వాల్‌(45), శుబ్‌మన్‌ గిల్‌(50), రవీంద్ర జడేజా(43) రాణించారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. లహిరు ఉదారను ప్రసిద్ద్‌ కృష్ణ పెవిలియన్‌కు పంపగా. నైట్‌ వాచ్‌మెన్‌ ప్రభాత్ జయసూర్య(2)ను మానవ్‌ సుతార్‌ పెవిలియన్‌కు పంపాడు.

జైశ్వాల్‌ సూపర్‌ క్యాచ్‌
కాగా రెండో రోజు ఆట ముగిస్తుందున్న సమయంలో భారత స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. లంక తొలి ఇన్నింగ్స్‌ రెండో ఓవర్ వేసిన ప్రసిద్ద్‌ కృష్ణ.. ఉదారకు బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఉదార డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని థర్డ్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. 

ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జైశ్వాల్‌.. ఎడమవైపు డైవ్‌ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో లంక బ్యాటర్‌ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement