మైదానంలోనే కాదు.. బయటా మాస్ బ్యాటింగే! వైభవ్‌ వీడియో వైరల్‌ | Vaibhav Sooryavanshis Epic Chat With Paps Viral | Sakshi
Sakshi News home page

మైదానంలోనే కాదు.. బయటా మాస్ బ్యాటింగే! వైభవ్‌ వీడియో వైరల్‌

Oct 16 2026 5:10 AM | Updated on Oct 16 2026 5:10 AM

Vaibhav Sooryavanshis Epic Chat With Paps Viral

PC: BCCI/X

టీమిండియా యువ సంచలనం  వైభవ్ సూర్యవంశీ  కేవలం బ్యాట్‌తోనే కాకుండా తన మాటకారితనంతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచిన భారత జట్టుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్మాన వేడుకలో పాల్గొనేందుకు వైభవ్‌ గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో వైభవ్‌కు ఘన స్వాగతం లభించింది.

విమానాశ్రయం నుండి బయటకు వస్తున్న వైభవ్ సూర్యవంశీని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు, ప్యాపరాజీలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అయినప్పటికీ అభిమానులను, కెమెరామెన్లను ఏమాత్రం నిరాశపరచకుండా ఆయన చిరునవ్వుతో ఫోటోలకు పోజులిచ్చారు.

ఈ క్రమంలోనే వీడియోలు, ఫోటోలు తీసే ఉత్సాహంలో ప్యాపరాజీలు వెనక్కి నడుచుకుంటూ ముందుకు వెళ్లడాన్ని వైభవ్ గమనించాడు. వారి భద్రతపై ఆందోళన చెంది, వెంటనే తనదైన శైలిలో వారిని అప్రమత్తం చేశారు. ఫోటోలకు పోజులిస్తూనే... "రీల్స్ తీసే పిచ్చిలో ఏదైనా వాహనం కింద పడతారు జాగ్రత్త!" అంటూ చమత్కరించారు. చుట్టూ ఉన్న వాహనాలను గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఆయన చెప్పిన మాటలకు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరలవుతోంది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement