తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ వైభవంగా సాగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారి కృపాకటాక్షాలు పొందారు.


