Kalpavriksha Vahanam
-
కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి :క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహనసేవలో ఎల్ ఏసీ ప్రెసిడెంట్ శ్రీ ఏ వి రెడ్డి, అర్చకులు, ఏఈవో శ్రీ రమేష్, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు : కల్పవృక్ష వాహనంపై స్వామివారి వాహన (ఫొటోలు)
-
ఆదివాసీల కల్పవృక్షం.. ఇప్ప చెట్టు
కొత్తగూడ: ఇప్ప చెట్టు ఆదివాసీల కల్పవృక్షంగా పేరుగాంచింది. వారికి పలు రకాల ఆదాయాన్ని సమకూరుస్తూ ఆర్థిక భరోసానిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంత అడవుల్లో విరివిగా కనిపించే ఇప్పచెట్లకు ఆదివాసీ తెగలో కొందరు పూజలు చేస్తారు. ఇప్ప నుంచి వచ్చే పూలు, గింజలతో ఆదివాసీ తెగలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్ప పువ్వులో ఎన్నో బలవర్థకమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా కుడుములు చేసుకుని తినడం ఆదివాసీల ఆహారపు అలవాటు. గతంలో ఆదివాసీలు ఇప్పపువ్వుతో సారాయి తయారు చేసుకుని తాగేవారు. ప్రస్తుతం జీసీసీ (గిరిజన సహకార సంస్థ) ద్వారా పలు ఆయుర్వేద కంపెనీలు ఇప్ప పువ్వును సేకరించి శవన్ప్రా , బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. దైవారాధనకు ఇప్ప నూనె ఇప్ప గింజలతో నూనె తీస్తారు. ప్రాచీన కాలంలో ఆదివాసీ కుటుంబాలు వంటల తయారీలో ఈ నూనె వాడుకునేవారు. ప్రస్తుతం దైవారాధనలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆదివాసీలు గింజలను పట్టించి కిలో ఇప్ప నూనెకు బదులు కిలో వంట నూనె (సన్‌ఫ్లవర్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్‌రిచ్ తదితర) తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో సేకరించిన వారు జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీ ఇప్పపువ్వును కిలో రూ.30, ఇప్ప పలుకు రూ.29తో కొనుగోలు చేస్తోంది. దీంతో స్థానికులు ఇప్ప పువ్వు, గింజల సేకరణకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆదివాసీలకు ఇప్పచెట్టుతో అవినాభావ సంబంధం ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీ తెగలకు ఇప్ప చెట్టుతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏటా జూన్ ప్రారంభంలో ఇప్ప చెట్టుకు పూజలు చేస్తారు. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా లభించే ఇప్ప ఉత్పత్తులను తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నారు. ఇప్ప పువ్వుకు రూ.100, పలుకులకు రూ.50 చెల్లించాలి. – వాసం వీరస్వామి, ఉపాధ్యాయుడువిక్రయానికి ఇబ్బందులు లేకుండా చూడాలి ఇప్ప పువ్వు సేకరించి శుద్ధి చేసి విక్రయించుకునేందుకు వెళ్తే కొనుగోలు చేసే వారు ఆలస్యం చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిందే తరలించలేదు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సేకరణ సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. – దాట్ల సుదర్శన్, కొత్తపల్లి గ్రామస్తులు -
తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహన సేవ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : కల్పవృక్ష వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి
-
తిరుమల : కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి
-
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు
-
కల్పవృక్ష వాహనంపై కనువిందు చేసిన శ్రీనివాసుడు
-
కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామివారు
-
కల్పవృక్ష వాహనంపై దేవదేవుడు
-
కల్పవృక్ష వాహనంపై దేవదేవుడు
తిరుమల : తిరుమల బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగాడు. పాల కడలి నుంచి వచ్చిన కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే... తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామివారు ఉదయం వేళ్లల్లో స్వర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగారు. భక్తుల కోర్కెలు తీరుస్తూ మలయప్పస్వామి తిరుగాడారు. దేవదేవుణ్ని కల్పవృక్ష వాహనంపై వీక్షించిన అశేష భక్తజనం భక్తిసాగరంలో మునిగిపోయారు. రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. మరోవైపు వెంకన్న దర్శనానికి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి ఆరు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.


