రాజస్థాన్‌లోని చురూ జిల్లా, సర్దార్‌షహర్‌లో విషాదం చోటు చేసుకుంది. జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతుండగా ప్రిన్సిపాల్ బీర్బల్ రామ్ మేఘ్వాల్ (49) కుప్పకూలిపోయారు. ఆస్పల్సర్లోని సీనియర్ సెకండరీ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బీర్బల్ గుండెపోటు కారణంగా మరణించినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆయన అకాల మరణం ఇటు కుటుంబ సభ్యులతో పాటు, ఇటు విద్యార్థులు తోటి విద్యార్థులు కూడా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకుసంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియా వైరల్ కావడంతో యూజర్లలో దిగ్భ్రాంతి, భయాందోళనలు నెలకొన్నాయి.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు తన చిన్న కూతురు కవితతో కలిసి జిమ్‌కు వెళ్లారు. సాయంత్రం 7 గంటల సమయంలో ట్రెడ్మిల్ మీద పరిగెడుతుండగా ఒక్కసారిగా కిందపడి స్పృహ కోల్పోయారు. జిమ్ నిర్వాహకుడు వెంటనే స్పందించి సుమారు రెండు నిమిషాల పాటు సీపీఆర్ చేశారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణం పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు.
Rajasthan: A 49-year-old government school principal d!ed after suddenly collapsing while running on a treadmill at a gym in Sardarshahar, Churu district. CCTV footage of the incident has surfaced. https://t.co/Ytl6y2DSOT
— Deadly Kalesh (@Deadlykalesh) October 14, 2026
ఇదీ చదవండి: జర్మనీలో అగ్నిప్రమాదం : ముగ్గురు భారతీయులు సజీవ దహనం
బీర్బల్ గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్నారు. 2006లో లెక్చరర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, 2018లో ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు (రితిక, కవిత) ఉన్నారు.


