‘డీలిమిటేషన్‌పై కేంద్ర పెద్దలతో చర్చించాం’ | YSRCPclarify their stand on supporting delimitation | Sakshi
Sakshi News home page

‘డీలిమిటేషన్‌పై కేంద్ర పెద్దలతో చర్చించాం’

Nov 29 2026 7:58 PM | Updated on Nov 29 2026 8:01 PM

YSRCPclarify their stand on supporting delimitation

ఢిల్లీ : డీలిమిటేషన్‌ అంశానికి సంబంధించి తమ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర పెద్దలు మాట్లాడారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తాము కేంద్ర మంత్రి అమిత్‌ షాతో సంప్రదింపులు జరిపామని, దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకుండా 50 శాతం పెంచిన నేపథ్యంలో బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్నారు.  డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు క్లారిటీ ఇచ్చారు.

‘డీలిమిటేషన్ కమిషన్‌లో అధికార పార్టీతో  సమానంగా ప్రాతినిధ్యం ఉండాలి. మహిళల రాజకీయ సాధికారతకు రిజర్వేషన్ అమలుచేయాలని గతంలోనే వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు. అధికార పార్టీ తమకు అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చే అవకాశం ఉందనే భయాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వీభజన ఫెయిర్‌గా జరగాలి’ అని పేర్కొన్నారు. 

మరో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ దేశంలో ఎక్కడా లేని విధంగా  స్థానిక సంస్థలలో మహిళలకు వైఎస్ జగన్ 50 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. మహిళలకు రిజర్వేషన్ దృష్టిలో ఉంచుకుని  డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. పెరిగిన సీట్లలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం సంతోషం. డీలిమిటేషన్ రాష్ట్రానికి దేశానికి మంచిది. సౌత్‌లో ఎన్ని సీట్లు పెరుగుతాయో,  నార్త్ లో కూడా అన్నే పెరిగితే గ్యాప్ ఎలా వస్తుంది. జనాభా నిష్పత్తి ప్రకారం వెళ్తే సౌత్,  నార్త్ గ్యాప్ పెరుగుతుంది. ఉన్న దాంట్లో ఇదే రీజనబుల్ ఫార్ములా’ అని తెలిపారు.

ఎంపీ గురుమూర్తి మాల్లాడుతూ.. ‘ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీ చేశాం. ఎంపీలు అందరూ పార్లమెంట్‌కు హాజరు కావాలి’ అని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి:  కైలే అనిల్ కుమార్‌పై కూటమి కక్ష సాధింపు చర‍్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement