శ్రీలంక కెప్టెన్‌ ధనంజయ సంచలన ప్రకటన | Sri Lanka captain de Silva step down captaincy with immediate effect | Sakshi
Sakshi News home page

శ్రీలంక కెప్టెన్‌ ధనంజయ సంచలన ప్రకటన

Oct 8 2026 12:15 PM | Updated on Oct 8 2026 12:30 PM

Sri Lanka captain de Silva step down captaincy with immediate effect

ధనంజయ డి సిల్వ (PC: SLC/ICC)

శ్రీలంక పురుషుల టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకొంటున్నట్లు గురువారం ప్రకటించాడు.

సెలక్షన్‌ కమిటీకి లేఖ
‘‘కొత్త తరానికి కెప్టెన్సీ బాధ్యతలు అందజేయాలనే ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం ఇది’’ అని ధనంజయ డి సిల్వ శ్రీలంక సెలక్షన్‌ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. నాయకుడిగా వైదొలిగినప్పటికీ ఆటగాడిగా మాత్రం జట్టులో కొనసాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌..
కొలంబోలో 1991లో జన్మించిన డి సిల్వ 2015లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 69 టెస్టులు, 93 వన్డేలు, 48 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. టెస్టుల్లో 4431, వన్డేల్లో 1924, టీ20లలలో 890 పరుగులు సాధించాడు. అదే విధంగా.. ఆయా ఫార్మాట్లలో 43, 48, 17 వికెట్లు పడగొట్టాడు ఈ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌.

సారథిగా రికార్డు ఇలా
ఇక 2024 జనవరిలో.. దిముత్‌ కరుణరత్నె నుంచి శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు డి సిల్వ. మొత్తంగా 18 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించి.. ఏడు టెస్టుల్లో జట్టును గెలిపించాడు. కెప్టెన్‌గా 1130 పరుగులు సాధించడంతో పాటు.. తొమ్మిది వికెట్లు కూడా కూల్చాడు.

కాగా  చివరిగా.. టీమిండియాతో ఈ ఏడాది జూలై- ఆగష్టులో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా ధనంజయ డి సిల్వ లంక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో భాగమైన ఈ సిరీస్‌లో భారత్‌ లంకను 1-0తో ఓడించింది.

నీ సేవలకు ధన్యవాదాలు
ధనంజయ డి సిల్వ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు స్వాగతించింది. లంక క్రికెట్‌ సీఈఓ ఆష్లే డి సిల్వ మాట్లాడుతూ.. ‘‘డి సిల్వ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము. మా టెస్టు జట్టుకు నాయకుడిగా సేవలు అందించినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. 

చదవండి: అప్పుడు ఐదెకరాల భూమి.. ఇప్పుడు మూడు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్న విరుష్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement