జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ విఫలమైనా.. ముంబై భారీ స్కోరు! | Jaiswal Sarfaraz Khan fail to deliver vs Chandigarh Mumbai score 429 | Sakshi
Sakshi News home page

జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ విఫలమైనా.. ముంబై భారీ స్కోరు!

Oct 12 2026 3:33 PM | Updated on Oct 12 2026 3:41 PM

Jaiswal Sarfaraz Khan fail to deliver vs Chandigarh Mumbai score 429

ఆయుశ్‌ మాత్రే (PC: MCA/X)

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ శుభారంభం అందుకోలేకపోయారు. ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరు.. చండీగఢ్‌తో మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. అయితే, యువ ఆటగాళ్లతో పాటు కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ రాణించడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించగలిగింది.

యశస్వి జైస్వాల్‌ డకౌట్‌
రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌- ‘డి’లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చండీగఢ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ డకౌట్‌ కాగా.. ఆయుశ్‌ మాత్రే (48) మెరుగ్గా రాణించాడు.

ముషీర్‌, సిద్దేశ్‌, తనుశ్‌, మోహిత్‌ హాఫ్‌ సెంచరీలు
వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్‌ ఖాన్‌ అర్ధ శతకం (65)తో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (86) సెంచరీ మిస్సయ్యాడు. అయితే, మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మాత్రం విఫలమైపోయాడు. ఆరు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు.

మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆకాశ్‌ ఆనంద్‌ (22), షమ్స్‌ ములాని (39) ఫర్వాలేదనిపించగా.. తనుశ్‌ కొటియాన్‌ (58), మోహిత్‌ అవస్థి (119 బంతుల్లో 56 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలు సాధించారు. తుషార్‌ దేశ్‌పాండే 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. 

ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా.. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. చండీగఢ్‌ బౌలర్లలో రోహిత్‌ ధండా, రాజ్‌ బవా చెరో నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జగ్జీత్‌ సింగ్‌, నిశాంక్‌ బిర్లా చెరో వికెట్‌ పడగొట్టారు. 

చదవండి: ‘హైదరాబాద్‌లో ఖేల్‌ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement