ముంబై జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సూర్య‌కుమార్‌కు షాక్‌! | Ranji Trophy 2026-27: Mumbai Announce Squad-Suryakumar-Dropped | Sakshi
Sakshi News home page

ముంబై జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. సూర్య‌కుమార్‌కు షాక్‌!

Oct 6 2026 9:26 AM | Updated on Oct 6 2026 9:32 AM

Ranji Trophy 2026-27: Mumbai Announce Squad-Suryakumar-Dropped

Photo Credit: Twitter

దేశ‌వాళీ టోర్నీ ప్ర‌తిష్టాత్మ‌క రంజీ ట్రోఫీలో ఆడి జాతీయ జ‌ట్టులోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని భావించిన స్టార్ క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌కు ఊహించని షాక్ త‌గిలింది. 2026-27 రంజీ ట్రోఫీ సీజన్లో చండీగ‌ఢ్‌తో ప్రారంభ మ్యాచ్ కోసం ముంబై 16 మందితో కూడిన‌ జట్టును ప్రకటించింది. 

రంజీల్లో ఆడేందుకు తాను అందుబాటులో ఉన్న‌ట్లు సూర్య‌కుమార్ స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ, ముంబై క్రికెట్ అసోసియేష‌న్ అత‌డి పేరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఇక ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోగా, సిద్ధేష్ లాడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, అత‌డికి డిప్యుటీగా ఆయుష్ మ‌హాత్రేను ఎంపిక చేసింది.

సూర్యకుమార్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ముంబై జట్టు నుంచి తొల‌గించ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని ముంబై ప్ర‌ధాన సెలెక్ట‌ర్ రాజేశ్ ప‌వార్ వెల్ల‌డించారు. యువకులకు అవకాశాలు ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే ఈ మ్యాచ్‌కు సూర్య‌ను ప‌క్క‌న‌బెట్టామ‌ని, భవిష్యత్తులో అతని ఎంపికకు ప్రాధాన్య‌త ఇస్తామ‌ని రాజేష్ పవార్ తెలిపారు.

ఇక కెప్టెన్‌గా 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను టీమిండియాకు అందించిన‌ సూర్య‌కుమార్ ఆ త‌ర్వాత జ‌ట్టులో చోటు కోల్పోయాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో ముంబై త‌ర‌ఫున‌ ఈ ఏడాది జనవరిలో పంజాబ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో చివరిసారిగా ఆడాడు.  అయితే 2025లో ముంబై రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో ఓడిపోయినప్పటి నుంచి సూర్య మ‌రో ఫ‌స్ట్‌క్లాస్  మ్యాచ్ ఆడలేదు. గత సీజన్‌లో సూర్య‌కుమార్‌ రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ సీజ‌న్‌లో రంజీ ట్రోఫీ ఆడాల‌ని సూర్య‌కుమార్ భావించిన‌ప్ప‌టికీ, అత‌డిని జ‌ట్టులోకి ఎంపిక చేయ‌లేదు.

చండీగఢ్‌తో జరిగే రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ముంబై తరఫున తిరిగి బరిలోకి దిగనున్నాడు. ఈ భారత ఓపెనర్ గత సీజన్‌లో క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ముంబై త‌ర‌ఫున చివ‌రిసారి ఆడాడు. న్యూజిలాండ్‌తో వ‌న్డే, టెస్టు సిరీస్ నేప‌థ్యంలో జైస్వాల్‌కు ఈ మ్యాచ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నుంది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన జైస్వాల్‌కు ఈ మ్యాచ్ కీల‌కం కానుంది.

ముంబై జట్టు: 
సిద్ధేష్ లాడ్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, ఆయుష్ మ‌హాత్రే(వైస్ కెప్టెన్‌), దివ్యాంష్ సక్సేనా, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్, ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ తమోర్ (వికెట్ కీప‌ర్‌), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, అథర్వ అంకోలేక‌ర్‌, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవ‌స్తీ, డిసౌజా, ఓంకార్ ట‌ర్మ‌లే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement