లాస్ వేగస్: ప్రపంచ అండర్ –23 రెజ్లింగ్ చాంపియన్షిప్ గ్రీకో రోమన్ శైలిలో భారత రెజ్లర్ విశ్వజీత్ మోరే రజత పతకం సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన 55 కేజీల విభాగం ఫైనల్లో విశ్వజీత్ 12–13 పాయింట్ల తేడాతో కోబా కరుమిద్జె (జార్జియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2024, 2025 ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్లలో కాంస్య పతకాలు గెలిచిన విశ్వజీత్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. తద్వారా ఈ ఘనత వహించిన తొలి భారతీయ గ్రీకో రోమన్ రెజ్లర్గా గుర్తింపు పొందాడు. మరోవైపు మహిళల విభాగం 59 కేజీల సెమీఫైనల్లో కోమల్ 1–13తో అలీనా ఫిలిపోవిచ్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం పోటీపడనుంది. దీక్షా మలిక్ (76 కేజీలు) కూడా సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం రేసులో నిలిచింది.


