టీమిండియా ప్లేయర్ సంచలన క్యాచ్‌.. ఆసీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌ | Devdutt Padikkal Takes A Stunning Diving Catch In India A Vs Australia A 1st One-Day | Sakshi
Sakshi News home page

IND vs AUS: టీమిండియా ప్లేయర్ సంచలన క్యాచ్‌.. ఆసీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌

Oct 6 2026 3:58 PM | Updated on Oct 6 2026 4:36 PM

Devdutt Padikkal Takes A Stunning Diving Catch In India A Vs Australia A 1st One-Day

PC: BCCI/X

పుదుచ్చేరి వేదిక‌గా ఆస్ట్రేలియా-తో జ‌రుగుతున్న తొలి అనధికారిక వ‌న్డేలో భార‌త్‌-ఎ జ‌ట్టు ఆట‌గాడు దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ ఫీల్డింగ్‌లో అద‌ర‌గొట్టాడు. ఆసీస్ బ్యాట‌ర్ జోష్ ఫిలిప్‌ను ప‌డిక్క‌ల్ సంచ‌ల‌న క్యాచ్‌తో పెవిలియ‌న్‌కు పంపాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్ వేసిన అర్ష‌ద్ ఖాన్ రెండో బంతిని ఫిలిప్‌కు ఔట్ సైడ్ ఆఫ్ దిశ‌గా సంధించాడు.

ఆ బంతిని ఫిలిప్‌ హాఫ్ సైడ్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వైడ్ స్లిప్ దిశ‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో ఆ స్ధానంలో ఉన్న ప‌డిక్క‌ల్ త‌న కుడివైపున‌కు డైవ్ చేస్తూ అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజ‌న్లు వావ్ వాట్ ఏ క్యాచ్ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భార‌త బౌల‌ర్ల ధాటికి కంగారులు త‌డ‌బడుతున్నారు. 26 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 126 ప‌రుగులు మాత్ర‌మే ఆసీస్ చేసింది. య‌శ్ ఠాకూర్‌, అర్షద్ ఖాన్ ఆసీస్ టాపార్డ‌ర్‌ను దెబ్బ‌తీశారు. ప్ర‌స్తుతం క్రీజులో కెప్టెన్ మెక్‌స్వీనీ(56) ఉన్నాడు.

తుది జ‌ట్లు
ఇండియా A: సాయి సుదర్శన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీప‌ర్‌), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), రజత్ పాటిదార్, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అర్షద్ ఖాన్, యశ్ ఠాకూర్

ఆస్ట్రేలియా A: సామ్ కాన్స్టాస్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్(వికెట్ కీప‌ర్‌), నాథన్ మెక్‌స్వీనీ, లియామ్ స్కాట్, నిఖిల్ చౌదరి, విల్ సదర్లాండ్(కెప్టెన్‌), టాడ్ మర్ఫీ, స్పెన్సర్ జాన్సన్, రిలే మెరెడిత్, మహ్లీ బార్డ్‌మన్


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement