తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా విహరించి భక్తులను అనుగ్రహించారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది.


