ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–16, 21–17తో ఐదో సీడ్ రాచెల్ అలీసా–రోజ్ ఫెబీ సెతియానిన్గ్రుమ్ (ఇండోనేసియా) జంటపై విజయం సాధించింది.
తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా 22–20, 21–14తో యాన్ ఫె చెన్–సియె పె షాన్ (చైనీస్ తైపీ)లపై గెలిచింది. పురుషుల సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 15–21, 15–21తో ప్రపంచ చాంపియన్ అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్లో అష్మిత చాలిహా ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్లో అష్మిత 18–21, 10–21తో ఓడిపోయింది.


