breaking news
treesa jolly
-
గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తెలంగాణ సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఏకైక పతకం అందించిన తెలంగాణ ప్లేయర్ పుల్లెల గాయత్రి,కేరళ క్రీడాకారిణి ట్రెసా జాలీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కలిసిన గాయత్రి–ట్రెసాలను సీఎం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గాయత్రి తల్లిదండ్రులైన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ పీవీవీ లక్ష్మి కూడా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో గాయత్రి–ట్రెసా జాలీలకు ‘అర్జున’ అవార్డు కూడా దక్కింది. -
ఆర్థిక కష్టాలు.. కూతురి కోసం ఇంట్లోనే ‘కోర్టు’ నిర్మించి.. ఇలా
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పుల్లెల గాయత్రి గోపీచంద్- ట్రెసా జాలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో ఈ జోడి కాంస్యంతో మెరిసింది. ఆ సమయంలో పుల్లెల గాయత్రి తండ్రి, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, చీఫ్ నేషనల్ కోచ్ గోపీచంద్ కూడా ఢిల్లీలోనే ఉండి మ్యాచ్‌ను వీక్షించాడు.తన కుమార్తె గాయత్రి, ట్రెసా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. నిజానికి బ్యాడ్మింటన్ గురించి తెలిసిన వారికి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కూతురు గాయత్రి తండ్రి అడుగుజాడల్లో బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుని ముందుకు సాగుతోంది.అయితే, గాయత్రి- ట్రెసా సాధించిన విజయం మరో వ్యక్తి కళ్లు కూడా ఆనందంతో చెమర్చేలా చేసింది. ఆయన మరెవరో కాదు ట్రెసా తండ్రి జాలీ మాథ్యూ. కేరళకు చెందిన ఆయన కూతురి కోసం స్వయంగా బ్యాడ్మింటన్ కోర్టును నిర్మించాడు. అన్నీ తానై కూతురిని ముందుకు నడిపి ఆమెను ఈస్థాయికి చేర్చాడు.పీఈటీ టీచర్.. వాలీబాల్ కోచ్కేరళలోని చెరుప్పుళ అనే చిన్న పట్టణం. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులు లేవు. అయితే, జామీ మాథ్యూ మాత్రం తన కూతురి కల నెరవేరాలంటే తాను శ్రమించక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. జాలీ మాథ్యూ పీఈటీ టీచర్. అంతేకాదు ఆయన వాలీబాల్ కోచ్ కూడా!ఇంటి ఆవరణలోనే..తన ఇంటి ఆవరణలోనే వాలీబాల్ కోర్టును నిర్మించి.. అక్కడే యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేవాడు. ట్రెసా, ఆమె అక్కడ పక్కన నిలబడి వారి ఆటను చూస్తూ ఉండేవారు. తన కూతుళ్లు ఇద్దరు ఆసక్తిగా వాలీబాల్‌ను వీక్షించడం చూసిన మాథ్యూ.. ఇద్దరూ వాలీబాల్ ప్లేయర్లు అవుతారని ఊహించారు. అయితే, ట్రెసాకు బ్యాడ్మింటన్‌లో మరింత ఆసక్తి ఉందని గమనించి ఆ దిశగా ప్రోత్సహించాడు.ఈ విషయం గురించి మాథ్యూ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ట్రెసాకు ఆటల పట్ల అమితాసక్తి ఉండేది. నేను ఇంట్లోనే చాలా మంది అమ్మాయిలకు వాలీబాల్ శిక్షణ ఇచ్చాను. నా కూతుళ్లకు కూడా ఎందుకు ట్రెయినింగ్ ఇవ్వకూడదనే ప్రశ్న తలెత్తింది.ఇండోర్ కోర్టు నిర్మించి..ట్రెసా బాగా ఆసక్తిగా ఉండేది. అయితే, బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టాక తన ఆసక్తి మారిపోయింది. అయితే, మా ప్రాంతంలో అసలు బ్యాడ్మింటన్ కోర్టులు లేవు. అందుకే నేనే మా ఇంట్లో ఓ ఇండోర్ కోర్టు కట్టించి.. అక్కడే ట్రెసాకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను.ఆర్థికంగా కష్టాలు అయితే, గాలితో కూడిన వర్షం పడినప్పుడు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయేవి. దీంతో ప్రాక్టీస్ కష్టమయ్యేది. ఆర్థికంగా కూడా కష్టాలు మొదలయ్యాయి. ఓసారి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు వెళ్లాము. అప్పుడే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థమైంది.స్థానిక ర్యాంకింగ్స్ ఆధారంగానే కేరళ జట్టుకు ఎంపిక చేస్తారనే విషయం తెలిసింది. వివిధ లోకల్ టోర్నీల్లో ఆడేందుకు మేము రాష్ట్రమంతా తిరిగేవాళ్లము. కానీ మాకు స్పాన్సర్లు దొరకలేదు. డబ్బుకు బాగా ఇబ్బంది అయ్యేది. ఏ అసోసియేషన్ కూడా మాకు సాయం చేయలేదు. దీంతో ఖర్చుల భారం తడిసిమోపెడు అయ్యేది.అయితే, ఆశయం నుంచి మేము ఎప్పుడూ దూరం కాలేదు. నిజానికి ట్రెసా చదువులో ముందు ఉండేది. మా ఊర్లో పిల్లలంతా డాక్టర్, ఇంజనీర్.. లేదంటే మరేదైనా ఉద్యోగం కోసం చదివేవాళ్లు. ఊర్లో ఎంతో మంది ఇంజనీర్లు ఉండవచ్చు. కొంతమంది డాక్టర్లూ ఉండొచ్చు. కానీ భారత్‌కు ఆడిన ప్లేయర్లు ఎంతో మంది ఉండరు కదా!అనిల్.. ఆ తర్వాత గోపీచంద్ట్రెసా ముందు దేశానికి ఆడాలి. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు వెళ్లాలి. అక్కడా పతకం గెలవాలి. ఇదే మా ధ్యేయం. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాము. నా స్నేహితుడు అనిల్ రామంద్రన్.. కన్నూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ హెడ్, బ్యాడ్మింటన్ స్పెషలిస్టు. ఆయనే నా కూతురికి కోచింగ్ ఇచ్చాడు.ఆ తర్వాత గోపీచంద్‌ను కలిశాము. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (TOPS)కి ట్రెసా ఎంపికైనపుడు ఆమె ప్లస్ వన్ చదువుతోంది. ఆ సమయంలో హైదరాబాద్‌లో సీనియర్క్యాంపులో ఉన్న గోపీచంద్‌కు రిపోర్టు చేసేది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది’’ అని జాలీ మాథ్యూ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు.కాగా జూనియర్ లెవల్లో ప్రతిభ కనబరిచిన గాయత్రి, ట్రెసాను కలిపి డబుల్స్ జోడీగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి జట్టుగా కొనసాగిన వీళ్లిద్దరు.. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత తొలిసారి భారత్‌కు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం అందించారు. ఇక గాయత్రి, ట్రెసాలకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.చైనా జంట చేతిలో పరాజయంన్యూఢిల్లీ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో గాయత్రి–ట్రెసా జంట 21–18, 13–21, 8–21 స్కోరుతో చైనాకు చెందిన వరల్డ్ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ జంట ల్యూ షెంగ్ షూ – టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 71 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత జంట తొలి గేమ్‌ను గెలుచుకున్నా...ఆపై పట్టు కోల్పోయింది.ఈ మ్యాచ్‌కు ముందు చైనా జోడితో ఏడు సార్లు తలపడి ఒకే ఒక సారి గెలిచిన భారత ద్వయం ఈ సారి కూడా ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్‌లో తొలి గేమ్ ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో గాయత్రి–ట్రెసా 7–2తో ముందంజ వేయగా, వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన చైనా జంట 11–7తో నిలిచింది. ఆ తర్వాత హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 12–12 నుంచి 18–18 వరకు చేరాయి. ఈ దశలో ట్రెసా క్రాస్ కోర్ట్ విన్నర్‌తో భారత్‌కు పాయింట్ దక్కగా, టాన్ వరుసగా రెండు సార్లు షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో గేమ్ ముగిసింది.అభిమానుల ప్రోత్సాహం మధ్య ఆట కొనసాగించిన భారత జోడి రెండో గేమ్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో స్కోరును 12–12 వరకు చేర్చింది. అయితే ఈ స్థితిలో ఒక్కసారిగా చైనా జోడి చెలరేగిపోయింది. పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ వరుసగా 8 పాయింట్లు సొంతం చేసుకొని 20–12కు దూసుకుపోయింది. ఆ తర్వాత మరో పాయింట్ సాధించడంతో గేమ్ చైనా వశమైంది. మూడో గేమ్‌లో పూర్తిగా చైనా హవానే సాగింది. 3–2తో ముందంజ వేసిన తర్వాత చైనా ఎక్కడా తగ్గలేదు. 8–5 నుంచి 15–5 వరకు ఆధిక్యంలో ఉన్న చైనా ఆ తర్వాత అలవోక పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. -
కాంస్యంతో సరిపెట్టుకున్న ట్రీసా-గాయత్రీ జోడీ
BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ జోడీ లియు షెంగ్షు-టాన్ నింగ్ చేతిలో 21-18, 12-21, 8-21 తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్ తరఫున పతకం సాధించిన ఏకైక జోడీగా ట్రీసా-గాయత్రీ నిలిచారు.దూకుడుగా ప్రారంభించినప్పటికీ..!ట్రీసా-గాయత్రీ జోడీ మ్యాచ్‌ను దూకుడుగా ప్రారంభించారు. 3-0 ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ చైనా జోడీ వేగంగా పుంజుకుని 7-7తో స్కోరును సమం చేసింది. విరామ సమయానికి లియు-టాన్ 11-7తో ఆధిక్యంలో నిలిచారు.అయితే భారత జోడీ వెనక్కి తగ్గలేదు. విరామం తర్వాత వరుస పాయింట్లతో పుంజుకుని 12-12తో స్కోరును సమం చేసింది. చివర్లో 18-18 వద్ద కీలకంగా ఆడిన ట్రీసా-గాయత్రీ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21-18తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు.రెండో గేమ్‌లో పుంజుకున్న ప్రత్యర్దిరెండో గేమ్‌లో లియు-టాన్ దూకుడుగా ఆడారు. గాయత్రీ చైనా జోడీ బ్యాక్‌హ్యాండ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యూహం మార్చడంతో భారత్ కొంత మేర ఫలితం సాధించింది. ఒక దశలో భారత్ 11-10తో ఆధిక్యంలోకి కూడా వచ్చింది.అయితే ఆ తర్వాత నెట్ వద్ద జరిగిన పొరపాట్లు భారత జోడీని దెబ్బతీశాయి. అనవసర తప్పిదాలతో చైనా జోడీ 18-12 ఆధిక్యంలోకి వెళ్లింది. ట్రీసా-గాయత్రీ తిరిగి పుంజుకోలేకపోవడంతో రెండో గేమ్‌ను 12-21తో కోల్పోయారు.నిర్ణయాత్మక గేమ్‌లో ఆధిపత్యంమూడో గేమ్ ఆరంభంలో ఇరు జోడీలు సమానంగా పోరాడినా.. లియు షెంగ్షు-టాన్ నింగ్ క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించారు. భారత జోడీ ఆటను చైనా క్రీడాకారిణులు సమర్థంగా చదివి వ్యూహం మార్చడంతో ట్రీసా-గాయత్రీకి పాయింట్లు రావడం కష్టమైంది.విరామ సమయానికి చైనా జోడీ 11-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒత్తిడిని కొనసాగిస్తూ వరుస పాయింట్లు సాధించింది. చివరకు నిర్ణయాత్మక గేమ్‌ను 21-8తో గెలిచి, మ్యాచ్‌ను 2-1తో సొంతం చేసుకుంది.సెమీఫైనల్లో ఓటమి ఎదురైనా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ ప్రదర్శన భారత బ్యాడ్మింటన్‌కు భారీ ఊరటనిచ్చింది. -
వరల్డ్ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లోకి ట్రీసా-గాయత్రీ జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ అదరగొడుతోంది. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ రిన్ ఇవానాగా-కీ నకనిషి జోడీని వరుస గేముల్లో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో పతకానికి భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది.అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ట్రీసా-గాయత్రీ జోడీ.. ప్రపంచ 7వ ర్యాంక్‌లో ఉన్న జపాన్ జోడీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం 41 నిమిషాల్లోనే 21-16, 21-12తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించిన భారత జోడీ.. రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.పీవీ సింధు ముందంజఇదే టోర్నీలో భారత మహిళల సింగిల్స్ స్టార్ పీవీ సింధు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 49వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ వెన్ యు జాంగ్‌తో 35 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 21–16, 21–17తో గెలిచింది. ఇవాళ జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో సింధు తలపడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ఉన్నతి హుడా రెండో రౌండ్లోనే వెనుదిరిగింది.ప్రిక్వార్టర్స్‌లో ఆయుశ్ శెట్టిపురుషుల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో ఆయుశ్ శెట్టి కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–10తో దుమిందు అబేవిక్రమ (శ్రీలంక)పై గెలుపొందాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ తలపడతాడు. పతకం తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న భారత నంబర్‌వన్, ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ అనూహ్య పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. -
ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన త్రీసా-గాయత్రీ జోడీ
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సంచలన విజయం సాధించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 16వ సీడ్ అమెరికా జోడీ లారెన్ లామ్–అల్లిసన్ క్విన్ లీని వరుస గేముల్లో ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.త్రీసా-గాయత్రీ జోడీ కేవలం 38 నిమిషాల్లో 21-15, 21-12 తేడాతో అమెరికా జోడీని చిత్తు చేసింది. ఆరంభం నుంచే త్రీసా–గాయత్రీ దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచారు.త్రీసా పవర్ఫుల్ స్మాష్‌లతో పాయింట్లు సాధించగా.. గాయత్రీ ర్యాలీలను కొనసాగిస్తూ చక్కటి డ్రాప్ షాట్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. దీంతో తొలి గేమ్‌ను 21-15తో సొంతం చేసుకుంది.రెండో గేమ్‌లోనూ భారత జోడీ అదే దూకుడును కొనసాగించింది. విరామ సమయానికి 11-4 ఆధిక్యం సాధించింది. ప్రత్యర్థుల అనవసర తప్పిదాలను కూడా సద్వినియోగం చేసుకున్న త్రీసా–గాయత్రీ.. వేగవంతమైన కదలికలు, అద్భుతమైన లైన్ జడ్జ్‌మెంట్‌తో మ్యాచ్‌ను 21-12తో ముగించింది.కవిప్రియ–సిమ్రన్‌కు నిరాశమరో భారత మహిళల డబుల్స్ జోడీ కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింఘి మాత్రం రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. 9వ సీడ్ బల్గేరియా జోడీ గాబ్రియేలా స్టోయేవా–స్టెఫానీ స్టోయేవా చేతిలో 7-21, 14-21తో ఓటమిపాలైంది. కేవలం 32 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశమిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీలకు శుభారంభం దక్కలేదు. రోహన్ కపూర్–రుత్విక శివాని గద్దె జోడీ కెనడాకు చెందిన జొనాథన్ బింగ్ త్సాన్ లై–క్రిస్టల్ లై చేతిలో 22-20, 19-21, 17-21తో పోరాడి ఓడింది.మరో జోడీ అశిత్ సూర్య–అమృత ప్రముతేష్ కూడా టర్కీకి చెందిన ఎమ్రే సోన్మెజ్–యాసెమెన్ బెక్టాస్ జోడీ చేతిలో తీవ్ర పోరాటం తర్వాత 21-16, 29-30, 22-24తో పరాజయం పాలైంది.అయితే 15వ సీడ్ భారత జోడీ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ఇంకా పోటీలో ఉంది. తొలి రౌండ్లో బై లభించడంతో.. రెండో రౌండ్లో మకావుకు చెందిన ఐక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జోడీతో తలపడనుంది.ఉనతి హుడాకు రెండో రౌండ్లోకి ప్రవేశంమహిళల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ ఉనతి హుడా కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మయన్మార్‌కు చెందిన థెట్ హ్తార్ తుజార్‌ను 22-20, 21-16తో ఓడించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఉనతి కీలక సమయంలో రాణించి విజయం సాధించింది. ఉనతి.. తదుపరి రౌండ్లో 13వ సీడ్ కెనడా షట్లర్ మిషెల్ లీతో తలపడనుంది.తొలి రోజే సంచలనంటోర్నీ తొలి రోజే భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీపై అద్భుత విజయం సాధించి. అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా రౌండ్ ఆఫ్ 64లో సునాయాస విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది.లక్ష్యసేన్ శుభారంభంపురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ బల్గేరియాకు చెందిన కాలిన్స్ వాలెంటైన్ ఫిలిమోన్ను మూడు గేముల్లో ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 16-21, 21-8, 21-4తో ఫిలిమోన్‌పై విజయం సాధించాడు. లక్ష్యసేన్ తదుపరి రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్తో తలపడనున్నాడు. -
నాన్న తోడుగా నిలువగా..
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇటీవల జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఎట్టకేలకు ఈ సీజన్‌ను సంతృప్తికరంగా మలచుకుంది. రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనలిస్టుగా నిలిచిన ఈ హైదరాబాద్ జోడీకి ఈ సీజన్ ఆరంభం నుంచి కలిసిరాలేదు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఈవెంట్లో క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన గాయత్రి–ట్రెసా ద్వయం స్విస్ ఓపెన్‌లో సెమీస్‌లోనే ఆగిపోయింది. తర్వాత జూన్‌లో గాయత్రి భుజం గాయంతో ఈ జోడీ మకావు ఓపెన్ నుంచి నిష్క్రమించి, ఇంటికే పరిమితమైంది. ఎట్టకేలకు తాజా లక్నో ఈవెంట్లో లభించిన టైటిల్ వీళ్లిద్దరి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీనిపై గాయత్రి మాట్లాడుతూ ఓపిక, పట్టుదల, అంకితభావానికి లభించిన టైటిల్‌గా అభివర్ణించింది. పలు అంశాలపై గాయత్రి, ట్రెసా జాలీ అభిప్రాయాలు వారి మాటల్లోనే...నాన్న తోడుగా నిలువగా... ఈ ఏడాది భుజం గాయం చాలా ఇబ్బంది పెట్టింది. సీజన్లో సుదీర్ఘకాలం ఆటకు దూరం చేసింది. రెండు నెలలకు పైగా విరామం తర్వాత మళ్లీ ఆడటం ప్రారంభించాను. ఇలాంటి సమయంలో సయ్యద్ మోడీ టైటిల్ నా ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. నా ఆట సరైన దిశలో సాగుతోందనిపించేలా చేసింది. నా ప్రదర్శన, ఫామ్‌పై నమ్మకాన్ని రెట్టింపు చేసింది. కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది. ముఖ్యంగా నాన్న పుల్లెల గోపీచంద్ ఎంతో శ్రద్ధ పెట్టాడు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఎప్పటికప్పుడు తోడుగా నిలిచాడు.కోటి ఆశలతో కొత్త సీజన్‌కు... మా జోడీకి ఈ సీజన్ గడ్డుగా గడిచింది. కానీ ఒక్క టైటిల్ సాఫల్యం మమ్మల్ని నిలబడేలా చేసింది. కొత్త ఆశలతో వచ్చే సీజన్‌ను ప్రారంభించేందుకు దోహదం చేసింది. ఈ ఏడాది మేం 13 వారాలపాటు (మూడు నెలలకు పైగానే) తొమ్మిదో ర్యాంక్‌తో టాప్–10లో కొనసాగాం. వచ్చే ఏడాది కూడా టాప్–10లో మరెంతో కాలం నిలిచేందుకు, నిలకడైన ఆటతీరుతో రాణించేందుకు నేను ట్రెసా జాలీ కష్టపడతాం. టైటిల్, టాప్–10 ర్యాంక్ మా ప్రదర్శనకు తగిన ప్రతిఫలంగా భావిస్తాం. ట్రెసా మిక్స్‌డ్‌లోనూ రాణించేందుకు శ్రమిస్తోంది. ప్రతీ ఈవెంట్లో ‘మిక్స్డ్’ కష్టమే... గాయత్రి గాయంతో దూరమవడంతో మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగాను. ఇది ఎంతకాలం కొనసాగిస్తానో చెప్పడం కష్టం. ముఖ్యంగా మేటి టోరీ్నల్లో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలను సమన్వయం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది. కోర్టులో గాయత్రితో నా సమన్వయం చక్కగా సాగుతోంది. ప్రతి టోర్నీపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. కాబట్టే ముందు మహిళల డబుల్స్‌కే ప్రాధన్యమిస్తాను. దీంతో పాటే మిక్స్‌డ్‌లో కొనసాగుతాను. ఆటలో ఏదీ అంతా సులువు కాదని నాకు తెలుసు. అందుకే ప్రతీరోజు కష్టపడాల్సి ఉంటుంది. –ట్రెసా జాలీ .చదవండి: Lionel Messi Net Worth 2025: నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. మెస్సీ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?


