సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఏకైక పతకం అందించిన తెలంగాణ ప్లేయర్ పుల్లెల గాయత్రి,కేరళ క్రీడాకారిణి ట్రెసా జాలీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కలిసిన గాయత్రి–ట్రెసాలను సీఎం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గాయత్రి తల్లిదండ్రులైన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ పీవీవీ లక్ష్మి కూడా పాల్గొన్నారు.
న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో గాయత్రి–ట్రెసా జాలీలకు ‘అర్జున’ అవార్డు కూడా దక్కింది.


