న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)–సబలెంకా (బెలారస్) జోడీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. సింగిల్స్‌లో మేటి క్రీడాకారులైన ఈ ఇద్దరు డబుల్స్‌లో సమన్వయంతో ఆడటంలో విఫలమయ్యారు. మహిళల డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ సినియకోవా (చెక్ రిపబ్లిక్)... పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జతగా మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగారు.
తొలి రౌండ్‌లో సినియకోవా–ప్యాటెన్ ద్వయం 1–4, 4–2, 10–2తో జొకోవిచ్–సబలెంకా జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్ డబుల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్), దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా) జోడీ ఇరిన్ రూట్లిఫ్ (న్యూజిలాండ్)–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటతో ఆడనుంది.


