22లో 18 వృథా.. జడేజా చెత్త రికార్డు; గిల్‌ జాగ్రత్త! | Ravindra Jadeja-last 22-DRS Reviews Struck-down As Bowler-Tests | Sakshi
Sakshi News home page

22లో 18 వృథా.. జడేజా చెత్త రికార్డు; గిల్‌ జాగ్రత్త!

Aug 25 2026 9:16 PM | Updated on Aug 25 2026 9:22 PM

Ravindra Jadeja-last 22-DRS Reviews Struck-down As Bowler-Tests

Photo Credit: BCCI Twitter

భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. అశ్విన్‌తో క‌లిసి బౌలింగ్‌ను పంచుకున్న జ‌డేజా టీమిండియా సాధించిన ఎన్నో విజ‌యాల్లో భాగ‌మయ్యాడు. వేగంగా ఓవ‌ర్లు పూర్తి చేయ‌డంలో జడేజా సిద్ధహస్తుడు. ఇక‌ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయ‌డం జడ్డూ శైలి కావ‌డంతో బ్యాట‌ర్లు ఎక్కువ‌గా ఎల్బీడ‌బ్ల్యూగానే వికెట్ ఇచ్చుకుంటారు. 

కానీ ఇప్పుడు అదే ఎల్బీడ‌బ్ల్యూల‌కు సంబంధించి డీఆర్ఎస్ తీసుకునే విష‌యంలో జడేజా చెత్త రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో గ‌ణాంకాల ప‌రంగా మెరుగ్గానే ఉన్న‌ప్ప‌టికీ.. డీఆర్ఎస్‌(అంపైర్ నిర్ణ‌యాన్ని స‌మీక్షించ‌డం)లో మాత్రం జ‌డ్డూ వ‌రుస‌గా ఫెయిల‌వుతూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు వ‌రుస‌గా 22 రివ్యూలను కోల్పోయాడు. 

వీటిలో నాలుగు ద‌ఫాలు మాత్ర‌మే అంపైర్ కాల్‌గా వెళ్లాయి. గ‌త మూడేళ్ల కాలంలో జ‌డేజా 22 సార్లు డీఆర్ఎస్‌లు తీసుకోగా.. అందులో 18 రివ్యూలు వృథా అయ్యాయి.దీంతో ఇన్ని రివ్యూలు కోల్పోయిన తొలి ఆల్‌రౌండ‌ర్‌గా జ‌డేజా చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్నాడు. చివ‌రిసారిగా 2023లో జ‌డేజా తీసుకున్న‌ రివ్యూ విజ‌య‌వంత‌మైంది. 

ఆ ఏడాది జూలైలో డొమినికా టెస్టులో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో రివ్యూతో కీమ‌ర్ రోచ్ వికెట్‌ను ద‌క్కించుకున్నాడు. అప్ప‌టి నుంచి జ‌డేజా మ‌ళ్లీ రివ్యూల్లో స‌క్సెస్ కాలేదు. అందుకే కెప్టెన్‌గా గిల్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. గ‌తంలో ఆటగాళ్లు పట్టుబట్టినా రివ్యూలు తీసుకోని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గిల్ నేర్చుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. 

ఇక జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు 90 టెస్టుల్లో 4,117 ప‌రుగులు చేయ‌డంతో పాటు 352 వికెట్లు ప‌డ‌గొట్టాడు.  ఇందులో 15సార్లు ఐదు వికెట్లు, మూడు ద‌ఫాలు ప‌ది వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు.

చదవండి:  జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాట‌ర్ అరుదైన రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement