అతడు తీవ్రంగా గాయపడ్డాడు: టీమిండియా కోచ్‌ | Badly bruised: Team India issues concerning update on Rishabh Pant | Sakshi
Sakshi News home page

అతడు తీవ్రంగా గాయపడ్డాడు: టీమిండియా కోచ్‌

Aug 25 2026 6:57 PM | Updated on Aug 25 2026 7:26 PM

Badly bruised: Team India issues concerning update on Rishabh Pant

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ గురించి భారత బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ కీలక అప్‌డేట్‌ అందించాడు. పంత్‌ భుజానికి తీవ్రమైన గాయమైందని తెలిపాడు. అందుకే మూడో రోజు ఆటలో అతడు మైదానంలో దిగలేదని తెలిపాడు.

కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 165 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో ఆదివారం ఇరుజట్ల మధ్య కొలంబోలో రెండో టెస్టు మొదలైంది. 

తొలిరోజు ఆట సందర్భంగా మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయపడ్డ పంత్‌.. మధ్యలోనే మైదానం వీడాడు. లాహిరు కుమార వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. పంత్‌ మణికట్టుకు గాయమైంది.

అయితే, సోమవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా పునరాగమనం చేసి అర్ధ శతకం (63)తో మెరిశాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు (503-9 డిక్లేర్డ్‌) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, మంగళవారం నాటి మూడో రోజు ఆటలో మాత్రం పంత్‌ కనిపించలేదు.

పంత్‌కు బదులు ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో ఆట పూర్తైన అనంతరం మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్‌ పంత్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘‘పంత్‌ భుజానికి తీవ్రమైన గాయమైంది. ఈరోజు రాత్రంతా అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు.

నిజానికి పంత్‌ జట్టుకు ఎంతో అవసరం. వికెట్‌ కీపర్‌గా అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. వికెట్ల వెనుక నుంచి అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు’’ అని మోర్నీ మోర్కెల్‌ తెలిపాడు. తద్వారా నాలుగో రోజు కూడా పంత్‌ అందుబాటులో ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చాడు.

ఇదిలా ఉంటే.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. పసిందు సూరియబండారా అర్ధ శతకం(80)తో రాణించగా.. సొనాల్‌ దినుష (85 నాటౌట్‌) సెంచరీపై కన్నేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ, మానవ్‌ సుతార్‌ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement