Photo Credit: Twitter
సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ సిన్సినాటి ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. రెండో రౌండ్‌లో తియాగో టిరంటే చేతిలో 2-6, 6-4, 6-4తో జకోవిచ్ పరాజయం చవిచూశాడు. అయితే జకోవిచ్ ఓటమి కంటే ముందే మ్యాచ్ మధ్యలో ఎండ వేడిమి తాళలేక మైదానంలోనే వాంతి చేసుకోవడం కలకలం రేపింది.
విషయంలోకి వెళితే.. మ్యాచ్ ఆరంభంలో జోకోవిచ్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ, మొదటి సెట్‌ను 6-2తో గెలుచుకున్నాడు. కానీ రెండో సెట్‌లో అక్కడి వాతావరణ పరిస్థితులు జకోవిచ్‌పై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి.18 నిమిషాల పాటు సాగిన మూడో గేమ్‌లో జకోవిచ్ అప్పటికే తొమ్మిది డ్యూస్‌ల్లో నాలుగు బ్రేక్ పాయింట్లు కాపాడుకున్నాడు.
అయితే ఆ తర్వాత వేడికి తాళలేక కోర్టులోనే వాంతి చేసుకున్నాడు. అయితే రెండోసెట్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు లాకర్ రూమ్‌లకు తిరిగి వెళ్లే ముందు ఒక ఫిజియోథెరపిస్ట్ మరియు డాక్టర్ అతనికి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ జకోవిచ్ ప్రభావం చూపించలేక ఓటమి దిశగా సాగాడు. 2005లో అరంగేట్రం నుంచి సిన్సినాటి ఓపెన్‌లో రౌండ్ ఆఫ్ 32లో నిష్క్రమించడం జకోవిచ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ టోర్నీకి సిన్నర్, అల్కరాజ్‌లు గాయాలతో దూరమయ్యారు.
Novak "My body hasn't responded so well after a Grand Slam in years" Djokovic
😅 pic.twitter.com/WssqtcEdaI— Corvath Draemir (@Archaicmind3000) August 15, 2026
120 MPH 🤯
Tirante UNLEASHES the fastest forehand of the 2026 Masters season! #CIncyTennis pic.twitter.com/rxkqlbBWz8— Tennis TV (@TennisTV) August 15, 2026
చదవండి: 31 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డులు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్


