breaking news
Cincinnati Masters Series
-
సిన్సినాటి మాస్టర్స్‌లో సంచలనాలు.. సబలెంకా, జ్వెరెవ్‌కు షాక్
సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఆర్యనా సబలెంకా, పురుషుల టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ నాలుగో రౌండ్లోనే పరాజయం పాలయ్యారు.నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన సబలెంకాను చెక్ రిపబ్లిక్కు చెందిన 35వ ర్యాంకర్ సారా బెజ్లెక్ 7-6 (9/7), 6-4తో ఓడించింది.జ్వెరెవ్‌కు టామీ పాల్ షాక్పురుషుల విభాగంలో జర్మనీకి చెందిన టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను అమెరికా ఆటగాడు టామీ పాల్ ఓడించాడు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన పోరులో పాల్ 4-6, 7-6 (8/6), 6-4తో విజయం సాధించాడు.రెండో సీడ్ ఫెలిక్స్ కూడా ఔట్కెనడాకు చెందిన రెండో సీడ్ ఫెలిక్స్ ఆగర్-అలియాసిమ్కు కూడా నిరాశే ఎదురైంది. అమెరికా ఆటగాడు ఫ్రాన్సిస్ టియాఫో 6-3, 6-4తో అతడిని ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు.మరో ఇద్దరు గ్రాండ్‌స్లామ్ చాంపియన్లు కూడా ఔట్ఈ టోర్నీ నుంచి మరో ఇద్దరు గ్రాండ్‌స్లామ్ చాంపియన్లు కూడా నిష్క్రమించారు. ఫ్రెంచ్ ఓపెన్ విజేత మిర్రా ఆండ్రీవాను ఉక్రెయిన్‌కు చెందిన మార్టా కొస్ట్యుక్ 4-6, 6-0, 6-2తో ఓడించగా, వింబుల్డన్ చాంపియన్ లిండా నోస్కోవాను అమెరికా క్రీడాకారిణి అమాండా అనిసిమోవా 6-1, 6-4తో చిత్తు చేసింది.గాఫ్, స్వియాటెక్ ముందుకుమహిళల విభాగంలో నాలుగో సీడ్ కోకో గాఫ్ 6-3, 6-2తో చెక్ రిపబ్లిక్కు చెందిన మేరీ బౌజ్కోవాను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. డిఫెండింగ్ చాంపియన్, ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ కూడా డయాన్ పార్రీపై 6-3, 6-3తో విజయం సాధించి, క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టింది. -
లైవ్ మ్యాచ్‌లో వాంతి చేసుకున్న జకోవిచ్.. షాక్‌లో ఫ్యాన్స్!
సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ సిన్సినాటి ఓపెన్‌లో రెండో రౌండ్లోనే ఓటమిపాలయ్యాడు. రెండో రౌండ్లో తియాగో టిరంటే చేతిలో 2-6, 6-4, 6-4తో జకోవిచ్ పరాజయం చవిచూశాడు. అయితే జకోవిచ్ ఓటమి కంటే ముందే మ్యాచ్ మధ్యలో ఎండ వేడిమి తాళలేక మైదానంలోనే వాంతి చేసుకోవడం కలకలం రేపింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ఆరంభంలో జోకోవిచ్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ, మొదటి సెట్‌ను 6-2తో గెలుచుకున్నాడు. కానీ రెండో సెట్లో అక్కడి వాతావరణ పరిస్థితులు జకోవిచ్‌పై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి.18 నిమిషాల పాటు సాగిన మూడో గేమ్‌లో జకోవిచ్ అప్పటికే తొమ్మిది డ్యూస్ల్లో నాలుగు బ్రేక్ పాయింట్లు కాపాడుకున్నాడు. అయితే ఆ తర్వాత వేడికి తాళలేక కోర్టులోనే వాంతి చేసుకున్నాడు. అయితే రెండోసెట్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు లాకర్ రూమ్‌లకు తిరిగి వెళ్లే ముందు ఒక ఫిజియోథెరపిస్ట్ మరియు డాక్టర్ అతనికి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ జకోవిచ్ ప్రభావం చూపించలేక ఓటమి దిశగా సాగాడు. 2005లో అరంగేట్రం నుంచి సిన్సినాటి ఓపెన్‌లో రౌండ్ ఆఫ్ 32లో నిష్క్రమించడం జకోవిచ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ టోర్నీకి సిన్నర్, అల్కరాజ్‌లు గాయాలతో దూరమయ్యారు.Novak "My body hasn't responded so well after a Grand Slam in years" Djokovic😅 pic.twitter.com/WssqtcEdaI— Corvath Draemir (@Archaicmind3000) August 15, 2026120 MPH 🤯Tirante UNLEASHES the fastest forehand of the 2026 Masters season! #CIncyTennis pic.twitter.com/rxkqlbBWz8— Tennis TV (@TennisTV) August 15, 2026చదవండి: 31 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డులు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ -
ఫెడరర్ ఏడోసారి...
- సిన్సినాటి మాస్టర్స్ టైటిల్ సొంతం సిన్సినాటి (అమెరికా): గతంలో తనకెంతో కలిసొచ్చిన సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఏడోసారి సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఫెడరర్ 7-6 (7/1), 6-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. తద్వారా గత నెలలో వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన ఫెడరర్... ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్, రెండో ర్యాంక్ ఆటగాళ్లను ఓడిస్తూ టైటిల్‌ను సాధించాడు. తాజా విజయంతో సోమవారం విడుదలైన ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ మళ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఫైనల్లో నెగ్గిన ఫెడరర్‌కు 7,31,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 కోట్ల 89 లక్షలు) లభించింది. గతంలో ఫెడరర్ సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను 2005, 2007, 2009, 2010, 2012, 2014లలో సాధించాడు. ఒకవేళ జొకోవిచ్ ఈ టైటిల్‌ను నెగ్గి ఉంటే ఏటీపీ మాస్టర్స్ సిరీస్‌లోని తొమ్మిది టోర్నీలనూ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు.


