Photo Credit: US Open Twitter
టెన్నిస్ ఆటలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సెర్బియా దిగ్గజం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్.. మహిళల ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకాతో కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో జత కట్టనున్నాడు. వీరితో పాటు టోర్నీలో బరిలోకి దిగనున్న 16 జట్ల జాబితాను ప్రకటించారు. గతేడాది యూఎస్ ఓపెన్‌కు ముందే టోర్నీని సమూలంగా మార్చారు.
పురుషుల, మహిళల విభాగంలో అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు మిక్స్‌డ్ డబుల్స్‌లో జతకట్టి ఆడితే ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అదనంగా ఇస్తామని యూఎస్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) గతేడాదే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి జకోవిచ్, సబలెంకా కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఇద్దరితో పాటు 2025లో రన్నరప్‌గా నిలిచిన ఇగా స్వియాటెక్, కాస్పర్ రూడ్ జంటతో పాటు ఎలెనా రైబాకినా-టేలర్ ఫ్రిట్జ్ , నవోమి ఒసాకా-కీ నిషికోరి, జెస్సికా పెగులా-జాక్ డ్రేపర్ మరోసారి బరిలోకి దిగుతున్నారు . ప్రధాన డ్రా ఆగస్టు 25-26 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఆర్థర్ ఆషే స్టేడియం, లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆగస్టు 17 వరకు జట్లు నమోదు చేసుకోవచ్చు.
ఆరోజు వరకు అత్యుత్తమ సంయుక్త సింగిల్స్ ర్యాంకింగ్‌లు కలిగిన ఆరు జంటలు ఆటోమేటిక్‌గా మెయిన్ డ్రాలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన టాప్-10లో ఉన్న జకోవిచ్, సబలెంకా జోడి నేరుగా మెయిన్ డ్రాలో ప్రవేశించనుంది. దీంతో పాటు ఎనిమిది జట్లకు యూఎస్‌టీఏ వైల్డ్ కార్డ్‌లను ఇస్తుంది. మరో రెండు జట్లు ఆగస్టు 24న జరిగే క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ద్వారా ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
అయితే గతేడాది మిక్సడ్ డబుల్స్ చాంపియన్లుగా నిలిచిన సారా ఎర్రాని, ఆండ్రీ వవస్సోరిలు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లో లేకపోవడంతో ఈ జంట మరోసారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఎనిమిది జట్లతో కూడిన క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌ను కూడా చేర్చారు,
ఇందులో ఆరు జట్లకు నేరుగా ప్రవేశం, రెండు జట్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. సెమీఫైనల్స్ వరకు, మ్యాచ్‌ల ఫార్మాట్ బెస్ట్-ఆఫ్-త్రీ-సెట్స్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో సెట్‌లు నాలుగు గేమ్‌లకు, 4-ఆల్ వద్ద టైబ్రేకర్లు, మూడవ సెట్‌కు బదులుగా 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేక్ ఉంటాయి. ఫైనల్ స్టాండర్డ్ స్కోరింగ్ పద్ధతిలో ఉంటుంది, ఇందులో సెట్‌లు ఆరు గేమ్‌లకు, 6-ఆల్ వద్ద టైబ్రేకర్, అవసరమైతే 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేకర్ ఉంటాయి.
Novak Djokovic and Aryna Sabalenka are set to play together in the upcoming US Open mixed doubles 🎾🤝 pic.twitter.com/NVnakqmwGT
— BBC Sport (@BBCSport) July 27, 2026


