బంగారు స్ఫూర్తి... మీరాబాయి చాను | Mirabai Chanu Wins Gold Medal At The 2026 Glasgow Commonwealth Games | Sakshi
Sakshi News home page

బంగారు స్ఫూర్తి... మీరాబాయి చాను

Jul 28 2026 10:16 AM | Updated on Jul 28 2026 10:50 AM

Mirabai Chanu Wins Gold Medal At The 2026 Glasgow Commonwealth Games

కామన్‌వెల్త్‌ పతకంతో మీరాబాయి చాను, జాతీయ స్థాయి పోటీపాల్గొన్న శృతి (కరీంనగర్‌)

ఉమ్మడి జిల్లా వెయిట్‌లిఫ్టర్లకు ఆదర్శంగా మీరాబాయి విజయం

క్రీడాకారుల్లో నూతనోత్సాహం

గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌–2026లో భారత వెయిట్‌లిఫ్టింగ్‌ స్టార్‌ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలని కలలు కంటున్న యువ క్రీడాకారుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపుతోంది.

సరైన శిక్షణ, కఠోరసాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె విజయం ఉమ్మడి జిల్లా వెయిట్‌ లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రపంచ వేదికపై విజయాలు సాధించవచ్చని మీరాబాయి మరోసారి నిరూపించారని కొనియాడారు. - కరీంనగర్‌

మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ
మీరాబాయి చాను విజయం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తాను. ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల.

– ఎం సాయిదుర్గ, జాతీయ వెయిట్‌లిఫ్టర్‌

జాతీయస్థాయిలో రాణిస్తా
మీరాబాయి చాను గోల్డ్‌ మెడల్‌ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె విజయాన్ని చూసిన తర్వాత మా సాధనపై మరింత నమ్మకం పెరిగింది. కోచ్‌ల సూచనలతో కష్టపడి సాధన చేసి జాతీయస్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్‌లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలనుకుంటున్నా 
– ఎన్‌ సాత్విక, స్టేట్‌ లెవల్‌ వెయిట్‌లిఫ్టర్‌

ఆత్మవిశ్వాసం పెంపు
మీరాబాయి చాను లాంటి చాంపియన్లు మార్గదర్శకులు. ఆమె క్రమశిక్షణ, అంకితభావం ప్రతీ క్రీడాకారుడు నేర్చుకోవాలి. ఆమె సాధించిన విజయం మాలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టర్లు రావాలనే సంకల్పంతో సాధన చేస్తున్నాం.
– డి.శృతి, జాతీయ వెయిట్‌లిఫ్టర్‌

అన్ని విధాలా ప్రోత్సాహం
జిల్లాలోని ప్రతి వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానును ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో సాధన చేస్తే అంతర్జాతీయ విజయాలు సాధించడం అసాధ్యం కాదు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు సంఘం తరఫున అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తాం.
– అంతటి శంకరయ్య, జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement