చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని.. | Sexual Assault On A Four Year Old Girl Incident In Malkajgiri Hyderabad | Sakshi
Sakshi News home page

చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..

Jul 28 2026 7:48 AM | Updated on Jul 28 2026 7:48 AM

Sexual Assault On A Four Year Old Girl Incident In Malkajgiri Hyderabad

నిందితుడు రవికుమార్‌

హైదారాబాద్‌, మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికకు చాక్లెట్‌ కొనిస్తానని తీసుకెళ్లిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపిన మేరకు.. మల్లికార్జునగర్‌కు చెందిన రవికుమార్‌(35) అదే ప్రాంతంలోని టెంట్‌హౌస్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం టెంట్‌హస్‌ సమీపంలో అపార్ట్‌మెంట్‌ వద్ద ఆడుకుంటున్న బాలిక (4)కు చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా రవికుమార్‌ తీసుకెళ్లిన విషయం చెప్పింది. ఈ ఘటన పై సోమవారం తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement