అంబులెన్స్‌లోనే గిరిజన మహిళ ప్రసవం | tribal woman gave birth to her child in an ambulance | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లోనే గిరిజన మహిళ ప్రసవం

Jul 28 2026 4:55 AM | Updated on Jul 28 2026 6:08 AM

tribal woman gave birth to her child in an ambulance

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూ ర్గంపాడు మండలం చింతకుంట గ్రామస్తుల రహదారి చింతలు తీరడం లేదు. గ్రామానికి 108 వాహనం వచ్చేందుకు కూడా వీల్లేని రహ దారితో గ్రామస్తులు నానా అవస్థలు పడుతు న్నారు. ఈ క్రమంలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అష్టకష్టాలపై అంబులెన్స్‌ వచ్చి నా ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మధ్యలోనే ప్రస వించింది. చింతకుంట గ్రామానికి చెందిన నిండు గర్భిణి సోడె మార్తకు సోమవారం ఉద యం పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబీకులు 108కు సమాచారమి చ్చారు.

ఆ గ్రామానికి వెళ్లేందుకు సరైన రహ దారి లేకపోవడంతో 108 పైలట్‌ విజయ భాస్కర్‌ గోతులు, రాళ్లతో కూడిన మార్గంలోనే అష్టకష్టాలు పడుతూ గ్రామానికి వెళ్లాడు. అప్ప టికే తీవ్రమైన పురిటినొప్పులతో బాధపడు తున్న మార్తను వాహనంలో ఎక్కించి భద్రా చలం తీసుకెళ్తుండగా అడవిమార్గంలోనే పురి టినొప్పులు పెరిగాయి. దీంతో 108 ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ రాధ పరిస్థితిని గమనించి మార్తకు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపై తల్లీబిడ్డలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement