breaking news
US Open Mixed Doubles
-
యుకీ బాంబ్రీ దూకుడు.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు
భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు ఫైనల్ చేరుకున్నాడు. న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ టర్నీలో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో జతకట్టి పురుషుల డబుల్స్ విభాగంలో ఆడుతున్న యూకీ సెమీస్‌లోకి ప్రవేశించాడు.బుధవారం ఆర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 14వ సీడ్ యూకీ–వీనస్ ద్వయం 6-3, 7-6, 6-3 తేడాతో 11వ సీడ్ నికోలా మెక్టిక్ - రాజీవ్ రామ్‌పై విజయం సాధించింది. శుక్రవారం జరగబోయే సెమీస్‌లో బ్రిట్స్ నీల్ స్కుప్స్కీ - జో శాలిస్బరీ జోడీతో యుకీ - మైకెల్ తలపడనున్నారు.ప్రీకార్టర్స్‌లో దూకుడు..అంతకుముందు ప్రీక్వార్ట్స్‌లో కూడా ఈ ఇండో-కివీ ద్వయం అదరగొట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యూకీ–వీనస్ జోడీ 6–4, 6–4తో నాలుగో సీడ్ కెవిన్ క్రావిట్జ్–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–కివీస్ జోడీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు జూనియర్ విభాగంలో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో మాయ రాజేశ్వరన్ 7–6 (7/1), 4–6, 3–6తో రెండో సీడ్ హనా క్లుగ్మన్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ తొలి రౌండ్లో మాయ (భారత్)–సినెల్లి (అర్జెంటీనా) జోడీ 2–6, 2–6తో జెలీనా (బెల్జియం)–లైమా (లిథువేనియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
సానియా జంట శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా-డోడిగ్ జంట 6-4, 6-4తో టేలర్ టౌన్సెండ్-డొనాల్డ్ యంగ్ (అమెరికా) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7-5, 6-4తో జేమీ లోబ్-నోవా రూబిన్ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న-ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్) ద్వయం 2-6, 6-7 (5/7)తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓటమి పాలైంది. మెరుున్ ‘డ్రా’కు ప్రాంజల బాలికల సింగిల్స్ విభాగంలో తెలుగు అమ్మారుు యడ్లపల్లి ప్రాంజల మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిం చింది. శనివారం జరి గిన క్వాలిఫరుుంగ్ రెండో రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ ప్రాంజల 6-4, 6-4తో కరియన్ పియర్ లూరుుస్ (అమెరికా)పై గెలిచింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల రెండు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
త్వరలో సానియాకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ సాధించిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాను త్వరలో తెలంగాణ ప్రభుత్వం సన్మానించనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును మంగళవారం సానియా మీర్జా కలిసింది. భవిష్యత్‌లో సానియాకు ప్రభుత్వం తరఫున కావలసిన సహాయం అందిస్తామని కేసీఆర్ చెప్పారు. విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమివ్వడాన్ని కేసీఆర్ ప్రశంసించారు.