
భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు ఫైనల్ చేరుకున్నాడు. న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ టర్నీలో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో జతకట్టి పురుషుల డబుల్స్ విభాగంలో ఆడుతున్న యూకీ సెమీస్‌లోకి ప్రవేశించాడు.
బుధవారం ఆర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 14వ సీడ్ యూకీ–వీనస్ ద్వయం 6-3, 7-6, 6-3 తేడాతో 11వ సీడ్ నికోలా మెక్టిక్ - రాజీవ్ రామ్‌పై విజయం సాధించింది. శుక్రవారం జరగబోయే సెమీస్‌లో బ్రిట్స్ నీల్ స్కుప్స్కీ - జో శాలిస్‌బరీ జోడీతో యుకీ - మైకెల్ తలపడనున్నారు.
ప్రీకార్టర్స్‌లో దూకుడు..
అంతకుముందు ప్రీక్వార్ట్స్‌లో కూడా ఈ ఇండో-కివీ ద్వయం అదరగొట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యూకీ–వీనస్ జోడీ 6–4, 6–4తో నాలుగో సీడ్ కెవిన్ క్రావిట్జ్–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–కివీస్ జోడీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు జూనియర్ విభాగంలో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్ రెండో రౌండ్‌లో మాయ రాజేశ్వరన్ 7–6 (7/1), 4–6, 3–6తో రెండో సీడ్ హనా క్లుగ్‌మన్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ తొలి రౌండ్‌లో మాయ (భారత్)–సినెల్లి (అర్జెంటీనా) జోడీ 2–6, 2–6తో జెలీనా (బెల్జియం)–లైమా (లిథువేనియా) జంట చేతిలో ఓటమి పాలైంది.